BCCI: భువనేశ్వర్‌కు బిగ్‌ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే!

Bhuvneshwar Kumar Out Of BCCI Central Contract - Sakshi

టీమిండియా వెటరన్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) బిగ్‌ షాకిచ్చింది. తమ వార్షిక కాంట్రాక్ట్‌ జాబితా నుంచి భువనేశ్వర్‌ను బీసీసీఐ తొలిగించింది. బీసీసీఐ తాజగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ లిస్ట్‌లో భువనేశ్వర్‌ కుమార్‌కు చోటు దక్కలేదు. భువీతో పాటు సీనియర్‌ ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మకు కూడా తమ కాంట్రాక్ట్‌లను కోల్పోయారు.

కాగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న భువీని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. గతేడాది ఆసియాకప్‌ నుంచి భువీ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఆసియాకప్‌-2022లో ఆప్గానిస్తాన్‌పై మినహా అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ భువీ చేయలేదు. అదే విధంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ కూడా భువనేశ్వర్‌ విఫలమయ్యాడు.

అనంతరం టీ20 ప్రపంచకప్‌లో కూడా తన చెత్త ఫామ్‌ను భువీ కొనసాగించాడు. ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్‌ కేవలం 4వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అయితే రెండు ఓవర్లు వేసిన భువనేశ్వర్‌ ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు.

గతేడాది టీ20 ప్రపంచకప్‌ నుంచి భువీ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ తన వార్షిక కాంట్రాక్ట్‌ కూడా కోల్పోవడంతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భువీ ప్రస్తుతం ఐపీఎల్‌-2023 సీజన్‌ కోసం సన్నద్దం అవుతున్నాడు. అతడు ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతున్నాడు.

బీసీసీ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితా (మొత్తం 26 మంది)  
►‘ఎ ప్లస్‌’ గ్రేడ్‌ (రూ. 7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. 
►‘ఎ’ గ్రేడ్‌ (రూ. 5 కోట్లు): హార్దిక్‌ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్‌ పంత్, అక్షర్‌ పటేల్‌. 
►‘బి’ గ్రేడ్‌ (రూ. 3 కోట్లు): పుజారా, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్‌ యాదవ్, శుబ్‌మన్‌ గిల్‌. 
►‘సి’ గ్రేడ్‌ (రూ. 1 కోటి): ఉమేశ్‌ యాదవ్, శిఖర్‌ ధావన్, శార్దుల్‌ ఠాకూర్, ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్, సంజూ సామ్సన్, అర్ష్‌దీప్‌ సింగ్, కోన శ్రీకర్‌ భరత్‌
చదవండి: 
BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్‌.. రాహుల్‌కు షాక్‌.. భరత్‌కు చోటు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top