BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్‌.. రాహుల్‌కు షాక్‌.. భరత్‌కు చోటు

BCCI Annual Player Retainership 2022 23 Jadeja Promoted KS Bharat In - Sakshi

బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన

BCCI Central Contract 2022-2023- ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్లకు సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గత ఏడాది ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ప్రమోషన్‌ సాధించి ‘ఎ ప్లస్‌’ గ్రేడ్‌లో చోటు దక్కించుకున్నాడు.

మరోవైపు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కేఎల్‌ రాహుల్‌ ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్‌లో ఉండగా, ఇప్పుడు ‘బి’కి పడిపోయాడు. నిలకడగా రాణిస్తున్న అక్షర్‌ పటేల్‌కు ‘ఎ’ గ్రేడ్‌లోకి ప్రమోషన్‌ లభించింది.

ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌కు తొలిసారి బోర్డు కాంట్రాక్ట్‌ (సి గ్రేడ్‌) దక్కడం విశేషం. మరోవైపు సీనియర్‌ ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌లు తమ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు.  

కాంట్రాక్ట్‌ జాబితా (మొత్తం 26 మంది)  
►‘ఎ ప్లస్‌’ గ్రేడ్‌ (రూ. 7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. 
►‘ఎ’ గ్రేడ్‌ (రూ. 5 కోట్లు): హార్దిక్‌ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్‌ పంత్, అక్షర్‌ పటేల్‌. 
►‘బి’ గ్రేడ్‌ (రూ. 3 కోట్లు): పుజారా, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్‌ యాదవ్, శుబ్‌మన్‌ గిల్‌. 
►‘సి’ గ్రేడ్‌ (రూ. 1 కోటి): ఉమేశ్‌ యాదవ్, శిఖర్‌ ధావన్, శార్దుల్‌ ఠాకూర్, ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్, సంజూ సామ్సన్, అర్ష్‌దీప్‌ సింగ్, కోన శ్రీకర్‌ భరత్‌.  

చదవండి: SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top