IND Vs AUS 4th Test Day-2: భారత్‌, ఆసీస్‌ నాలుగో టెస్టు.. 444 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా

BGT 2023: India Vs Australia 4th Test Day-2 Live Updates-Highlights - Sakshi

Ind Vs Aus 4th Test Day 2 highlights: 
టీమిండియాతో నాలుగో టెస్టులో రెండో రోజు ఆటలోనూ ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగించింది. ఖవాజా, గ్రీన్‌ సెంచరీలకు తోడు టెయిలెండర్లు నాథన్‌ లియోన్‌ 34, టాడ్‌ మర్ఫీ 41 పరుగులతో రాణించడంతో భారీ స్కోరు చేసింది. 480 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి 36 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 17, శుబ్‌మన్‌ గిల్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ కంటే రోహిత్‌ సేన 444 పరుగులు వెనుకబడి ఉంది.

ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్‌
ఉస్మాన్‌ ఖవాజా(180), కామెరాన్‌ గ్రీన్‌(114) సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. 480 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. భారత బౌలర్లలో అశ్విన్‌కు అత్యధికంగా 6, షమీకి రెండు, జడేజా, అక్షర్‌ పటేల్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

విసిగిస్తున్న టెయిలెండెర్లు.. ఆసీస్‌ స్కోరు 458/8
అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్‌ బ్యాటింగ్‌ కొనసాగుతుంది. ఆసీస్‌ టెయింలెండర్లు టీమిండియా బౌలర్లను విసిగిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 458 పరుగులు చేసింది. టాడ్‌ మర్ఫీ 34, నాథన్‌ లియోన్‌ 20 పరుగులతో ఆడుతున్నారు.

ముగిసిన ఖవాజా మారథాన్‌ ఇన్నింగ్స్‌.. ఎనిమిదో వికెట్‌ డౌన్‌
అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియాతో టెస్టులో ఉస్మాన్‌ ఖవాజా డబుల్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. 180 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 

టీ విరామం.. ఆస్ట్రేలియా స్కోరు 409/7
టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా 180 పరుగులతో అజేయంగా ఆడుతుండగా.. లియోన్‌ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు.

400 పరుగుల మార్క్‌ దాటిన ఆస్ట్రేలియా
టీమిండియాతో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 400 పరుగుల మార్క్‌ను అందుకుంది. ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ఖవాజా 174, లియోన్‌ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా..
టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌ తన ప్రభావం చూపిస్తున్నాడు. వరుసగా నాలుగో వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. మిచెల్‌ స్టార్క్‌(8) రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన స్టార్క్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్‌ స్కోరు 387/7 గా ఉంది. ఖవాజా 165 పరుగులతో తన ఆటను కొనసాగిస్తున్నాడు.

టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చిన అశ్విన్‌.. ఆరు వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
ఎట్టకేలకు టీమిండియా వికెట్లు పడగొట్టింది. తొలుత సెంచరీ సాధించిన కామెరాన్‌ గ్రీన్‌ను అశ్విన్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఖవాజా, గ్రీన్‌ల మధ్య ఏర్పడిన 208 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మరోసారి అశ్విన్‌ బ్రేక్‌ ఇచ్చాడు. అలెక్స్‌ కేరీని డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 382 పరుగులతో ఆడుతుంది. ఖవాజా 169 పరుగులు, మిచెల్‌ స్టార్క్‌ మూడు పరుగులతో ఆడుతున్నారు.

గ్రీన్‌ సెంచరీ.. 
ఆస్ట్రేలియా బ్యాటర్‌ కామెరాన్‌ గ్రీన్‌ శతకంతో మెరిశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో గ్రీన్‌ 143 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో శతకం సాధించాడు. కాగా గ్రీన్‌ కెరీర్‌లో ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది.

లంచ్‌ బ్రేక్‌.. 150 మార్క్‌ అందుకున్న ఖవాజా, సెంచరీ దిశగా గ్రీన్‌
అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆటలో లంచ్‌ విరామ సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా 150 పరుగుల మార్క్‌ను అందుకొని అజేయంగా ఆడుతుండగా.. గ్రీన్‌ 95 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 177 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. తొలి సెషన్‌లో ఆస్ట్రేలియాదే పూర్తి ఆధిపత్యం.. టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయారు. ఆసీస్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది. 

150 మార్క్‌ అందుకున్న ఖవాజా.. భారీ స్కోరు దిశగా ఆసీస్‌
అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఉస్మాన్‌ ఖవాజా 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 348 బంతులెదుర్కొన్న ఖవాజా 20 ఫోర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులతో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. గ్రీన్‌ 86 పరుగులతో ఖవాజాకు అండగా ఉన్నాడు.

300 దాటిన ఆస్ట్రేలియా స్కోరు
నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా దూకుడు కనబరుస్తోంది. రెండో రోజు ఆటలో ఆసీస్‌ జట్టు స్కోరు 300 దాటింది. 109 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఖవాజా 133, గ్రీన్‌ 70 పరుగులతో క్రీజులో ఉన్నారు.

గ్రీన్‌ అర్థసెంచరీ
ఆస్ట్రేలియా బ్యాటర్‌ కామెరాన్‌ గ్రీన్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 99 ఓవర్లలో 267/4గా ఉంది. ఉస్మాన్‌ ఖవాజా 111, గ్రీన్‌ 54 పరుగులతో ఆడుతున్నారు.

రెండోరోజు మొదలైన ఆట
అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండోరోజు ఆట మొదలైంది.  తొలిరోజు ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా  90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖాజా (251 బంతుల్లో 104 బ్యాటింగ్‌; 15 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు.  ఖాజాతో పాటు కామెరాన్‌ గ్రీన్‌ (49 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.

తొలిరోజు ఆలౌట్‌. మూడో రోజుకల్లా ముగింపు! ఆ్రస్టేలియా ఆడినా... భారత్‌ ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేసినా... ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో ఇది షరామామూలే! కానీ ఆఖరి టెస్టు అలా మొదలవలేదు. మొతెరా వికెట్‌ బ్యాటర్లకు అవకాశమిచ్చింది. ఆలౌట్‌ కాదుకదా... కనీసం సగం వికెట్లు (5) అయినా ఆతిథ్య భారత బౌలర్లు పడగొట్టలేకపోయారు. ఇదే మరో నాలుగు రోజులు కొనసాగితే ఈ టెస్టు ఐదు రోజుల పాటు జరగడం ఖాయం. మరి రెండోరోజు ఆటలోనైనా టీమిండియా బౌలర్లు చెలరేగి వికెట్లు పడగొడతారేమో చూడాలి

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top