ఆటకు గుడ్‌బై చెప్పిన టీమిండియా క్రికెటర్‌ | Bengal Pacer Ashok Dinda Retires From All Forms Of Cricket | Sakshi
Sakshi News home page

ఆటకు గుడ్‌బై చెప్పిన టీమిండియా క్రికెటర్‌

Feb 2 2021 9:30 PM | Updated on Feb 2 2021 9:41 PM

Bengal Pacer Ashok Dinda Retires From All Forms Of Cricket - Sakshi

ముంబై: పశ్చిమ బెంగాల్‌కు దశాబ్దానికి పైగా ప్రాతినిధ్యం వహించిన పేసర్‌ అశోక్‌ దిండా మంగళవారం అంతర్జాతీయ సహా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కాగా ఆశోక్‌ దిండా టీమిండియా తరపున 13 వన్డేల్లో 12 వికట్లు, 9 టీ20ల్లో 17 వికెట్లు తీయగా.. ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌లాడి 69 వికెట్లు తీశాడు. ఇక  ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌‌లో 116 మ్యాచ్‌లాడిన దిండా 420 వికెట్లు తీశాడు. కాగా పశ్చిమ బెంగాల్‌ తరపున దశాబ్దం పాటు ఆడిన దిండా తనపై తప్పుడు ఆరోపణలు రావడంతో గతేడాది బెంగాల్‌ జట్టు నుంచి తప్పుకున్నాడు. కాగా ఈ సీజన్‌లో గోవాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. చదవండి: క్రికెటర్‌ షమీకి భార్య హసీన్‌ జహాన్‌ మరో షాక్‌

ఈ సందర్భంగా దిండా మీడియాతో మాట్లాడాడు.'భారత్‌ తరఫున ఆడాలనేది ప్రతి ఒక్కరి కోరిక. నేను బెంగాల్‌ తరఫున ఆడాను. అందుకే నాకు దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. భారత్‌ తరఫున ఆడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు బీసీసీకి కృతజ్ఞతలు.దీప్‌దాస్‌ గుప్తా, రోహన్‌ గావస్కర్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు నాకు మార్గనిర్దేశనం చేశారని' దిండా పేర్కొన్నాడు. చదవండి: వైరల్‌: షర్ట్‌ లేకుండా పరిగెత్తాడు.. చివరికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement