IPL 2023: 16 కోట్లు పెట్టి కొన్నారు.. ఒక్క మ్యాచ్‌లో కూడా! ఇప్పుడు ఏకంగా టోర్నీ మొత్తానికి

Ben Stokes not willing to rush recovery for CSK, focused on Ashes 2023 - Sakshi

ఐపీఎల్‌-2023 మినీవేలంలో ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను రూ.16.25 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తాడని స్టోక్స్‌పైన ఇంత భారీ మొత్తాన్ని సీఎస్‌కే వెచ్చించింది. ఎన్నో అంచనాల మధ్య ఈ ఏడాది క్యాష్‌ రిచ్‌లీగ్‌లో అడుగుపెట్టిన స్టోక్స్‌.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. 

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు మాత్రచే చేసి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదే తీరును ఈ టెస్టు కెప్టెన్‌ కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో కూడా 8 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్‌ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌ పరంగా రెండు ఓవర్లు వేసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 

ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో బెన్‌ స్టోక్స్‌ బొటనవేలికి గాయమైంది. దీంతో అతడు సీఎస్‌కే ఆడిన తర్వాత మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కాగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరో వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

టోర్నీ మొత్తానికి దూరం..!
ఇక గాయం నుంచి కోలుకున్నా కానీ బెంచ్‌కే పరిమితవ్వాలని స్టోక్స్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దానికీ కారణం లేకపోలేదు. ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్న యాషెస్‌ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని స్టోక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ సమయానికి ఫుల్‌ ఫిట్‌నెస్‌తో ఉండాలని ఇంగ్లం‍డ్‌ క్రికెట్‌ బోర్డు నుంచి కూడా అదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

అదే విధంగా ఇంగ్లండ్‌ టెస్టు కోచ్‌ బ్రెండన్ మెకల్లమ్ సైతం స్టోక్స్‌తో నిత్యం టచ్‌లో ఉన్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి.ఈ క్రమంలో స్టోక్స్‌ మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో సీఎస్‌కే తరపున ఆడేది అనూమానమే. ఒక వేళ స్టోక్స్‌ టోర్నీ మొత్తానికి దూరమైతే.. సీఎస్‌కే పెట్టిన రూ.16.25 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అనే చెప్పుకోవాలి.
చదవండి: IPL 2023: దుమ్ము రేపుతున్నాడు.. సన్‌రైజర్స్‌ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే?
                  Mohit Sharma: ఒకప్పుడు పర్పుల్‌ క్యాప్‌ విన్నర్‌.. తర్వాత నెట్‌బౌలర్‌! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. రీ ఎంట్రీలో..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top