
ఆర్సీబీ(PC: ipl.com)
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్‌కు ముందు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సీజన్ నుంచి బ్యాటర్ల దూకుడును కట్టడి చేసేందుకు ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లలను అనుమతించనున్నట్లు ఈఎస్సీఎన్ క్రిక్ ఈన్‌ఫో తమ నివేదికలో పేర్కొంది.
దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఐపీఎల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఈ రూల్‌ను ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బీసీసీఐ అమలు చేసింది. కాగా ఈ నిబంధన బౌలర్లకు సహకరిస్తుందని టీమిండియా వెటరన్ జయదేవ్ ఉనద్కట్ ఈఎస్సీఎన్‌తో చెప్పుకొచ్చాడు. ఈ చిన్న మార్పు గెలుపోటములను ఎంతగానో ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనుంది. ఈ కొత్త రూల్‌ను దృష్టిలో పెట్టుకుని వేలంలో ఆయా ఫ్రాంచైజీలు పాల్గోనే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో వరల్డ్‌క్లాస్ పేసర్లు మిచిల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, దక్షిణాఫ్రికా యువ సంచలనం గెరాల్డ్ కోట్జీపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది.
చదవండి: WI vs ENG: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడికి బిగ్ షాక్..