Team India Jersey: టీమిండియా కొత్త జెర్సీ ఎలా ఉందో చూడండి..!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొద్ది సేపటి కిందట టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ జెర్సీని టీ20 వరల్డ్ కప్ 2022 కోసం రూపొందించినప్పటికీ.. సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ నుంచే భారత ఆటగాళ్లు ధరిస్తారని బీసీసీఐ పేర్కొంది. టీమిండియా అఫీషియల్ కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ కన్ఫర్మ్ చేసిన జెర్సీకే బీసీసీఐ యధాతథంగా ఆమోదం తెలిపింది.
To every cricket fan out there, this one’s for you.
Presenting the all new T20 Jersey - One Blue Jersey by @mpl_sport. #HarFanKiJersey#TeamIndia #MPLSports #CricketFandom pic.twitter.com/3VVro2TgTT
— BCCI (@BCCI) September 18, 2022
ఆసియా కప్ 2022లో భారత ఆటగాళ్లు ధరించిన జెర్సీతో పోలిస్తే, కొత్త కిట్‌లో కొద్దిగా నీలిరంగు షేడ్ ఉంది. చేతులు, షోల్డర్ డార్క్ బ్లూ కలర్‌లో ఉండగా.. జెర్సీపై గీతలు వచ్చాయి. ఇది 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భారత జెర్సీకి దగ్గరగా ఉంది. 2020లో ఎంపీఎల్-బీసీసీఐల మధ్య ఒప్పందం కుదిరాక రూపొందించబడ్డ మూడో జెర్సీ ఇది. కాగా, మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో దర్శనమిస్తారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు