BCCI Releases Media Rights Tenders For Bilateral India Games - Sakshi
Sakshi News home page

BCCI: భారీ ఆదాయంపై కన్ను.. మీడియా హక్కుల టెండర్లు విడుదల

Aug 2 2023 7:48 PM | Updated on Aug 2 2023 8:22 PM

BCCI Releases Media Rights Tenders For Bilateral India Games - Sakshi

బీసీసీఐ భారీ ఆదాయంపై కన్నేసింది.స్పాన్స‌ర్‌షిప్ హ‌క్కుల రూపంలో కోట్లు గడించాలని చూస్తోంది. ఈ మేరకు స్పాన్సర్‌షిప్‌ టెండ‌ర్ల‌కు ఆహ్వానాలు ప‌లికిన సంగతి తెలిసిందే. అయితే ఒక్క రోజు గ‌డువ‌క ముందే దేశ‌వాళీ, అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌కు మీడియా హ‌క్కులు క‌ట్ట‌బెట్టేందుకు సిద్ధ‌ప‌డింది.

వ‌న్డే వ‌ర్డ‌ల్ క‌ప్(ODI World Cup 2023) స‌మీపిస్తున్నందున మీడియా హ‌క్కుల కోసం ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నట్టు బుధవారం ప్ర‌క‌టించింది. అంతేకాదు ఇన్విటేష‌న్ టు టెండ‌ర్‌(Invite To Tender)లో వివ‌రాల‌తో పాటు ష‌ర‌తులు స్ప‌ష్టంగా పేర్కొంది. ఆస‌క్తిగ‌ల మీడియా సంస్థ‌లు జీఎస్టీ(GST)తో క‌లిపి రూ.15 ల‌క్ష‌ల నాన్ రీఫండ‌బుల్ ఫీజు చెల్లించాల‌ని తెలిపింది.

అర్హ‌త‌లు, అవ‌స‌రాలు, బిడ్స్ వేయ‌డం, హ‌క్కులు, అభ్యంత‌రాలు.. ఇవ‌న్నీ టెండ‌ర్ ప్ర‌క్రియ‌లో భాగ‌మ‌ని బీసీసీఐ వెల్ల‌డించింది. ఐటీటీ ఆగస్టు 25వ తేదీ వ‌రకు అందుబాటులో ఉంటుందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.

చదవండి: బంతిని తన్నబోయి ప్రత్యర్థి కాలు విరగొట్టాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement