
PC: IPL
IPL 2022 Schedule Venue: ఐపీఎల్- 2022కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ను స్వదేశంలో కాకుండా విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు వంటి సమయంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌పై వస్తున్న వార్తలు అన్ని అవాస్తవమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. రానున్న మెగా వేలం తర్వాతే ఐపీఎల్- 2022కు వేదికలు, షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలానికే బీసీసీఐ ప్రాధాన్యతనిస్తుందని అతను తెలిపాడు.
"ఐపీఎల్- 2022కు ఎలాంటి వార్తలను నమ్మవద్దు . ఇప్పటి వరకు ఐపీఎల్ షెడ్యూల్ లేదా వేదికలు ఖరారు కాలేదు. మాకు ప్రస్తుతం వేలం ప్రధానం. మేము కోవిడ్-19 పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాం. వేలం నిర్వహించిన తర్వాత, మేము ఐపీఎల్- 2022 వేదిక, షెడ్యూల్ తేదీలపై తుది నిర్ణయం తీసుకుంటాం" అని బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. ఇక మెగా వేలం ఫిబ్రవరి రెండో వారంలో జరగనున్నట్లు సమాచారం.
చదవండి: NZ vs BAN: డబుల్ సెంచరీతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్..