దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు ప్రకటన.. రోహిత్‌, కోహ్లి దూరం | Sakshi
Sakshi News home page

IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు ప్రకటన.. రోహిత్‌, కోహ్లి దూరం

Published Thu, Nov 30 2023 8:36 PM

BCCI Announces India Squad For South Africa Tour - Sakshi

దక్షిణాఫ్రికా పర్యటనకు మూడు వేర్వేరు జట్లను అజిత్‌ అగర్కార్‌ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. అందరూ ఊహించనట్టుగానే  టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ,  స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, హార్దిక్‌ పాండ్యా దూరమయ్యారు. అయితే వీరినలుగరిని దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు.

మరోసారి సూర్యకు..
ప్రోటీస్‌తో టీ20లకు భారత జట్టు కెప్టెన్‌గా మరోసారి సూర్యకుమార్‌ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. సూర్య ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారత జట్టు సారథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న శుబ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌.. తిరిగి సఫారీలతో టీ20 జట్టులోకి వచ్చారు. టీ20 సిరీస్‌లో సూర్యకు డిప్యూటీగా జడ్డూ వ్యవహరించనున్నాడు. 

వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌..
ఇక​ దక్షిణాఫ్రికాతో వన్డేల్లో భారత కెప్టెన్‌గా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అయితే దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న తమిళనాడు యవ సంచలనం సాయి సుదర్శన్‌కు తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. అతడితో పాటు సంజూ శాంసన్‌, యుజ్వేంద్ర చాహల్‌, రజిత్‌ పాటిదర్‌కు కూడా సెలక్టర్లు పిలుపు నిచ్చారు. 

రోహిత్‌, విరాట్‌ ఎంట్రీ..
ఇ‍క​ టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లిని సెలక్టర్లు ఎంపిక చేశారు. రోహిత్‌ సారధ్యం వహించనుండగా.. జస్ప్రీత్‌ బుమ్రా వైస్‌ కెప్టెన్‌ వ్యవహరించనున్నాడు. అదే విధంగా కర్ణాటక పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణకు తొలిసారి భారత టెస్టులో ఛాన్స్‌ లభించింది.

కాగా ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. డిసెంబర్‌ 10న డర్బన్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో టీమిండియా ప్రోటీస్‌ పర్యటన ప్రారంభం కానుంది.

టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్ష్దీప్ సింగ్, మహ్మద్‌ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, మొహమ్మద్. షమీ*, జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ.

వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ లియర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌) (వారం), సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్.

Advertisement
 
Advertisement