రిజ్వాన్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన బాబర్‌ ఆజం.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

PAK vs AUS: రిజ్వాన్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన బాబర్‌ ఆజం.. వీడియో వైరల్‌

Published Sun, Nov 26 2023 1:58 PM

Babar Azam Chases Mohammad Rizwan With Bat In Hand - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో తీవ్ర నిరాశపరిచిన పాకిస్తాన్‌ జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతోంది. ఆసీస్‌ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా ప్రకటించింది.

బాబర్‌ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో తమ టెస్టు కొత్త కెప్టెన్‌గా షాన్‌ మసూద్‌ను పీసీబీ ఎంపిక చేసింది. ఆసీస్‌ సిరీస్‌తో పాకిస్తాన్‌ కెప్టెన్‌గా షాన్‌ మసూద్‌ ప్రయాణం ప్రారంభం కానుంది.  డిసెంబర్‌ 14న పెర్త్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ రెడ్‌బాల్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. కాగా ఈ కీలక సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ జట్టు ఇప్పటినుంచే తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేసింది. లాహోర్‌లోని  హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో పాక్‌ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది.

రిజ్వాన్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన బాబర్‌..
పాకిస్తాన్‌ ప్రాక్టీస్‌ క్యాంప్‌లో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మ​హ్మద్‌ రిజ్వాన్‌ను మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సరదగా బ్యాట్‌తో కొట్టబోయాడు. ఇంట్రాస్క్వాడ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓవర్‌ పూర్తి అయిందని బాబర్‌ క్రీజును వదిలి ముందుకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వికెట్ల వెనుక ఉన్న రిజ్వాన్‌ స్టంప్స్‌ను పడగొట్టి రనౌట్‌కు అప్పీల్‌ చేశాడు.

ఇది చూసిన బాబర్‌ సరదగా తన బ్యాట్‌తో రిజ్వాన్‌ను కొట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో రిజ్వాన్‌ నవ్వుతూ ముందుకు పరిగెత్తాడు. బాబర్‌ కూడా తన వెనుక పరిగెత్తుకుంటూ వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా మిగితా ఆటగాళ్లూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

Advertisement
 
Advertisement