రబ్బిష్‌.. కోహ్లిని మేమెందుకు తిడతాం

Australia Head Coach Justin Langer Says We Dont Taunt Virat Kohli - Sakshi

అడిలైడ్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఎలా అవుట్‌ చేయాలనే దానిపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నట్లు ఆసీస్‌ ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్‌ 17 నుంచి అడిలైడ్‌ వేదికగా తొలి డే నైట్‌  టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఆసీస్‌ కోచ్‌ లాంగర్‌ విరాట్‌ కోహ్లిని కట్టడి చేయడంతో పాటు టీమిండియాపై అమలు చేయనున్న ప్రణాళికలను వెల్లడించాడు. (చదవండి : టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ : నెంబర్‌ 1 ఆసీస్‌)

'ఇంకో మూడు రోజుల్లో టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. టీమిండియాపై గెలిచేందుకు మా ప్రణాళికలను రచించుకుంటున్నాం. ఇందులో భాగంగానే విరాట్‌ కోహ్లిని ఎలా అవుట్‌ చేయాలనే దానిపై చర్చించుకున్నాం. అంతేకాని కోహ్లిని తిట్టడం వాటి గురించి మేమెందుకు మాట్లాడతాం..ఇదంతా రబ్బిష్‌. మేము కేవలం అతని నైపుణ్యంపైనే దెబ్బతీస్తాం తప్ప.. ఎమోషన్స్‌తో ఆడుకోం.

మాకు ఎమోషన్స్‌ ఉంటాయి.. వాటిని కంట్రోల్‌ చేసుకొని ముందుకు సాగుతాం. కోహ్లిలో గొప్ప ఆటగాడే కాదు మంచి నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. కోహ్లి టీమిండియాకు చాలా విలువైన ఆటగాడు.. ఫాంలో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. నాకు అతనిపై చాలా గౌరవం ఉంది. కానీ అతన్ని అవుట్‌ చేస్తేనే మా పని సులువుగా జరిగిపోతుంది. కోహ్లి ఒక్క టెస్టు మ్యాచ్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాడన్న విషయం తెలుసు.. అందుకే ఎలా అవుట్‌ చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నాం'అంటూ చెప్పుకొచ్చాడు. కాగా  ఆసీస్‌తో జరిగే మొదటి టెస్టు తర్వాత స్వదేశానికి వెళ్లిపోనున్న సంగతి తెలిసిందే. పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వెళ్లనున్న కోహ్లి స్థానంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. (చదవండి : కొట్టేస్తా... ఏమనుకున్నావ్‌!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top