ఆర్చర్లు అద్భుతం చేసేనా?

Atanu Das, Pravin Jadhav, Tarundeep Rai Men Team Archery event today - Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల మూడో రోజు తొమ్మిది క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే మూడింటిలో (ఆర్చరీ, షూటింగ్, ఫెన్సింగ్‌) మాత్రమే మనోళ్లు పతకాల కోసం పోటీపడనున్నారు. పురుషుల ఆర్చరీ టీమ్‌ విభాగంలో అతాను దాస్, ప్రవీణ్‌ జాదవ్, తరుణ్‌దీప్‌ రాయ్‌లతో కూడిన భారత బృందం తొలి రౌండ్‌లో కజకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ దక్షిణ కొరియా జట్టుతో టీమిండియా ఆడాల్సి ఉంటుంది. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి టీమ్‌ ఈవెంట్‌ మొదలయ్యాక దక్షిణ కొరియా పురుషుల జట్టు ఐదుసార్లు స్వర్ణ పతకం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో కొరియాపై భారత్‌ అద్భుతం చేస్తే సెమీఫైనల్‌ చేరుకొని కాంస్య పతకం రేసులో నిలుస్తుంది.
పురుషుల టీమ్‌ విభాగం తొలి రౌండ్‌: భారత్‌ x కజకిస్తాన్‌ (ఉదయం గం. 6 నుంచి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top