Asia Cup 2022: శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గనిస్తాన్‌.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం

Asia Cup 2022: Sri lanka vs Afghanistan updates and highlights - Sakshi

8 వికెట్ల తేడాతో  ఆఫ్గనిస్తాన్‌ ఘన విజయం
ఆసియాకప్‌-2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి ఆఫ్గనిస్తాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్‌కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తద్వారా ఆఫ్గనిస్తాన్‌ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో చేధించింది.

ఆఫ్గాన్‌ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(37),గుర్బాజ్(40) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా ఒక్కడే ఒక వికెట్‌ సాధించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ఆఫ్గాన్‌ బౌలర్లు చేలరేగడంతో 105 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గానిస్తాన్‌ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. నబీ, ముజీబ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో భానుక రాజపక్స 38 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చేలరేగి ఆడుతోన్న ఆఫ్గనిస్తాన్‌ ఓపెనర్లు
106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్‌ ఓపెనర్లు చేలరేగి ఆడుతున్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. క్రీజులో హజ్రతుల్లా జజాయ్(32), రహ్మానుల్లా గుర్బాజ్(40) పరుగులతో ఉన్నారు.
 

నాలుగు ఓవర్లకు ఆఫ్గనిస్తాన్‌ స్కోర్‌: 41/0
106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్‌ నాలుగు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో హజ్రతుల్లా జజాయ్(14), రహ్మానుల్లా గుర్బాజ్(17) పరుగులతో ఉన్నారు.

105 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 105 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గానిస్తాన్‌ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. నబీ, ముజీబ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో భానుక రాజపక్స 38 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

13 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. 


11 ఓవర్లకు శ్రీలంక స్కోర్‌: 66/6
వరుసగా శ్రీలంక రెండు వికెట్లు ​కోల్పోయింది. 10 ఓవర్‌ వేసిన ముజీబ్‌ బౌలింగ్‌లో హసరంగ ఔట్‌ కాగా.. తర్వాత ఓవర్‌ వేసిన నబీ బౌలింగ్‌లో షనక పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు శ్రీలంక స్కోర్‌: 66/6


నాలుగో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
49 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్‌ కోల్పోయింది. 24 పరుగులు చేసిన గుణతిలక.. ముజీబ్‌ బౌలింగ్‌లో జనత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో హసరంగా, భానుక రాజపక్స ఉన్నారు

6 ఓవర్లకు శ్రీలంక స్కోర్‌: 41/3
ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక తిరిగి పుంజుకుంది. 6 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక మూడు వికెట్లు ​కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజులో దనుష్క గుణతిలక(15), భానుక రాజపక్స(19) పరుగులతో ఉన్నారు.

తొలి ఓవర్‌లో రెండు వికెట్లు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఫజల్హక్ ఫరూఖీ ఆదిలోనే దెబ్బకొట్టాడు. తొలి ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి ఆఫ్గానిస్తాన్‌కు అద్భుతమైన శుభారంభం అందించాడు. ఐదో బంతికి కుశాల్‌ మెండీస్‌, అఖరి బంతికి అసలంకను ఎల్బీ రూపంలో  ఫరూఖీ పెవిలియన్‌కు పంపాడు. తొలి ఓవర్‌ ముగిసేసరికి శ్రీలంక స్కోర్‌: 3/2

ఆసియాకప్‌-2022లో భాగంగా తొలి మ్యాచ్‌లో దుబాయ్‌ వేదికగా ఆఫ్గనిస్తాన్‌, శ్రీలంక జట్లు తలపడునున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆఫ్గానిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా శ్రీలంక తరపున దిల్షన్ మదుశంక, మతీషా పతిరన ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు.

తుది జట్లు
శ్రీలంక
దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్‌), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, మతీశ పతిరణ
ఆఫ్గానిస్తాన్‌
హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ(కెప్టెన్‌), రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫరూఖీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top