Asia Cup 2022 Winner Prediction: కచ్చితంగా ఆ జట్టు ట్రోఫీ గెలవగలదు: పాక్‌ మాజీ కెప్టెన్‌

Asia Cup 2022: Salman Butt Response If India Can Win Do They Lack Vitamins - Sakshi

Asia Cup 2022 Winner Prediction: ఆసియా కప్‌-2022 ట్రోఫీ సాధించగల సత్తా టీమిండియాకు ఉందా అన్న ప్రశ్నపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ సరదాగా స్పందించాడు. కచ్చితంగా భారత్‌ ట్రోఫీ గెలవగలదన్న అతడు.. వాళ్లకేమైనా విటమిన్లు తక్కువయ్యాయా అంటూ చమత్కరించాడు. టీమిండియా బెంచ్‌ పటిష్టంగా ఉందన్న ఉద్దేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆగష్టు 27 నుంచి ఈ మెగా ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

ఆసియా కప్‌ ట్రోఫీ కోసం భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌ తలపడనున్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఏడు సార్లు విజేతగా నిలిచిన టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఈసారి కప్‌ను లిఫ్ట్‌ చేయగల సత్తా భారత్‌కు ఉందా అంటూ సల్మాన్‌ బట్‌కు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్న ఎదురైంది.

కచ్చితంగా వాళ్లు గెలవగలరు!
ఇందుకు స్పందించిన ఈ పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌.. ‘‘కచ్చితంగా వాళ్లు గెలవగలరు. వాళ్లకేమైనా విటమిన్లు తక్కువయ్యాయా? గత కొన్ని రోజులుగా ఇండియా అద్భుతంగా ఆడుతోంది. వాళ్లకు చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. కాబట్టి వారినే చాలా మంది ఫేవరెట్లుగా పేర్కొంటున్నారు’’ అని అన్నాడు.

ఇక ఇతర జట్ల విజయావకాశాల గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌ జట్టు తనదైన రోజు చెలరేగి ఎవరినైనా ఓడించగలదని అందరికీ తెలుసు. టీ20 ఫార్మాట్‌లో మెరుగైన భాగస్వామ్యాలే కీలకం. అయితే, ఆరోజు పరిస్థితి ఎలా ఉందన్న అంశం మీదే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అఫ్గనిస్తాన్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. ఇక బంగ్లాదేశ్‌ విషయానికొస్తే.. వాళ్లు ఒక్కోసారి బాగానే ఆడతారు.

మరికొన్ని సార్లు మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తారు’’ అని సల్మాన్‌ బట్‌ పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్‌-2022లో భాగంగా ఆగష్టు 28న భారత్‌- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. టీ20 ప్రపంచకప్‌-2021లో పాక్‌ చేతిలో ఎదురైన ఘోర ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది. 

చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్‌ షమీ ‘భార్య’ అభ్యర్ధన
Rishabh Pant- Urvashi Rautela: మరీ అంత స్ట్రెస్‌ తీసుకోకు: బాలీవుడ్‌ హీరోయిన్‌కు పంత్‌ మరో కౌంటర్‌!
Asia Cup 2022 : కోహ్లి ఫామ్‌లోకి వస్తే అంతే సంగతులు.. పాకిస్తాన్‌కు ఆ దేశ మాజీ కెప్టెన్‌ వార్నింగ్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top