Asia Cup 2022: భారత్, పాకిస్తాన్ మధ్య ‘సూపర్–4’ మ్యాచ్

రెండో రౌండ్ పోరు
రాత్రి గం.7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్: క్రికెట్ అభిమానులకు వరుసగా రెండో ఆదివారం అసలైన సాయంత్రపు వినోదం. వారం రోజుల వ్యవధిలో భారత్, పాకిస్తాన్ జట్లు రెండోసారి తలపడనున్నాయి. ఆసియా కప్ ‘సూపర్–4’ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
సరిహద్దు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేని లోటును తీరుస్తూ టోర్నీలో జరుగుతున్న రెండో రౌండ్ పోరు కూడా అంతే ఆసక్తిని రేపుతోంది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో చివరి ఓవర్లో విజయంతో భారత్‌దే పైచేయి అయింది. రోహిత్ శర్మ సేన అదే జోరును కొనసాగిస్తుందా లేక బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని పాక్ బదులు తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరం.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు