IND vs SA: అక్కడ ఉంది నేను కాదు.. డీకే కదా.. హార్దిక్‌ సింగిల్‌ తీయాల్సింది!

Ashish Nehra gets sarcastic on Hardik Pandya denying single in last over - Sakshi

ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇన్నింగ్స్‌ అఖరి ఓవర్‌లో హార్ధిక్‌ పాండ్యా తీరు కాస్త విడ్డూరంగా అనిపించింది. సింగిల్‌ తీయడానికి వీలున్నప్పటికీ దినేష్‌ కార్తీక్‌కు స్ట్రైక్‌ ఇవ్వకుండా హార్ధిక్‌ తిరష్కరించాడు. ఈ క్రమంలో హార్ధిక్‌ తీరుపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.

కాగా తాజాగా ఈ ఘటనపై భారత మాజీ పేసర్‌ ఆశిష్ నెహ్రా స్పందించాడు.  అఖరి ఓవర్‌లో ఐదో బంతికి సింగిల్‌ తీసి పాండ్యా దినేష్ కార్తీక్‌కు స్ట్రైక్ ఇచ్చి ఉండాల్సిందని భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. "చివరి ఓవర్‌లో పాండ్యా సింగిల్ తీసి ఉండాల్సింది. మరో ఎండ్‌లో దినేష్ కార్తీక్ ఉన్నాడు. అక్కడ ఉన్నది నేను కాదు కదా" అని ఆశిష్ నెహ్రా  చమత్కరించాడు

ఏం జరిగిదంటే..
భారత ఇన్నింగ్స్‌ అఖరి ఓవర్‌ వేసిన నార్జే బౌలింగ్‌లో తొలి బంతికే కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ పెవిలియన్‌కు చేరాడు.  అనంతరం దినేష్‌ కార్తీక్‌ క్రీజులోకి వచ్చాడు. కార్తీక్‌ ఆడిన తొలి బంతికి ఎటువంటి పరుగు రాలేదు. ఇక మూడో బంతికి సింగిల్‌ తీసి హార్ధిక్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. నాలుగో బంతికి లాంగ్‌ ఆఫ్‌ దిశగా పాండ్యా భారీ సిక్స్‌ బాదాడు. అయితే ఐదో బంతికి సింగిల్‌ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని హార్ధిక్‌ తిరష్కరించాడు. ఇక ఇరో బంతికి భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించిన హార్ధిక్‌.. కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు..

ఐపీఎల్‌-2022లో ఆర్సీబీ బెస్ట్‌ ఫినిషర్‌
ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీకు కార్తీక్‌ అత్యుత్తమ ఫినిషర్‌గా మారాడు. చాలా మ్యాచ్‌ల్లో తన అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 16 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్‌ 330 పరుగులు సాధించాడు.
చదవండి: Hari Nishaanth: ఘనంగా యువ క్రికెటర్‌ పెళ్లి.. ‘సూపర్‌ కపుల్‌’ అంటూ సీఎస్‌కే విషెస్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top