Ashes 1st Test: Has England Done Over Action By Declaring Innings On Very First Day - Sakshi
Sakshi News home page

Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి ఇంగ్లండ్‌ ఓవరాక్షన్‌ చేసిందా..?

Published Sat, Jun 17 2023 7:16 PM

Ashes 1st Test: Has England Done Over Action By Declaring Innings On Very First Day - Sakshi

ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ (టెస్ట్‌ల్లో) బజ్‌ బాల్‌ అంటూ తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అప్రోచ్‌తో ఆ జట్టు చాలా మ్యాచ్‌ల్లో గెలుపొంది, భారీ సక్సెస్‌ సాధించింది. తాజాగా ఆ జట్టు యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌లోనూ బజ్‌బాల్‌ ఫార్ములానే ఉపయోగించి, తొలి ఇన్నింగ్స్‌ను తొలి రోజే డిక్లేర్‌ చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయం ఇంగ్లండ్‌కు మరో విజయం సాధించి పెడుతుందో, లేక ఆ జట్టు కొంపముంచుతుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

లంచ్‌ విరామం సమయానికి (78/3) ఆట ఇంగ్లండ్‌ వైపే మొగ్గుచూపుతున్నప్పటికీ మరికొద్ది గంటలు గడిచే వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. లంచ్‌ తర్వాత ఆసీస్‌ గేర్‌ మార్చి వేగంగా పరుగులు సాధిస్తుండటంతో మ్యాచ్‌ ఫలితం ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. 45 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ 3 వికెట్లు కోల్పోయి 148 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఉస్మాన్‌ ఖ్వాజా (66), ట్రవిస్‌ హెడ్‌ (50) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆసీస్‌ ఇంకా 245 పరుగులు వెనుకపడి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. రూట్‌ (118 నాటౌట్‌), జాక్‌ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయోన్‌ 4, హాజిల్‌వుడ్‌ 2, బోలండ్‌, గ్రీన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనం‍తరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. రెండో రోజు ఆట తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లు స్టువర్ట్‌ బ్రాడ్‌, స్టోక్స్‌ చెలరేగి.. వార్నర్‌ (9), లబూషేన్‌ (0), స్టీవ్‌ స్మిత్‌ (16) వికెట్లు పడగొట్టారు.  

చదవండి: Ashes Series 1st Test: స్మిత్‌ భరతం పట్టిన స్టోక్స్‌


 

Advertisement

తప్పక చదవండి

Advertisement