టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండింట మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ గుడ్ న్యూస్‌ను కాస్త ఆలస్యంగా మంగళవారం(ఫిబ్రవరి 20) అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడుకి అకాయ్ అని పేరు పెట్టినట్లు విరుష్క జోడీ వెల్లడించింది.
అదే విధంగా తమ గోప్యతను గౌరవించాలని విరాట్ సోషల్ మీడియా వేదికగా విజ్ణప్తి చేశాడు. కాగా తన పిల్లల విషయంలో కోహ్లి చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన గారాలపట్టి వామికను పుట్టినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంచుతూ కోహ్లి వస్తున్నాడు.
ఇప్పటివరకు విరుష్క దంపతులు ఆమె ఫొటోను సైతం బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఆకాయ్ విషయంలోనూ అదే జాగ్రత్తలను ఈ సూపర్ కపుల్ పాటిస్తోంది. తమ మరోసారి తల్లిదండ్రులమయ్యామని ప్రకటించిన విరుష్క జోడీ.. ఎక్కడ కూడా ఆకాయ్ ఫోటోను షేర్ చేయలేదు.
కానీ అభిమానులు మాత్రం జూనియర్ విరాట్ ఎలా ఉంటాడో చూడటానికి తహతహలడుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఫ్యాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(ఏఐ) సాయంతో అకాయ్ ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. అకాయ్ టీమిండియా జెర్సీలో.. అనుష్క, విరాట్‌తో కలిసి ఉన్నట్లు ఫోటోను క్రియేట్ చేశారు.
                                      
అది కూడా కోహ్లి జెర్సీ నెం18తో కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా అకాయ్ పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సైతం పుట్టుకుట్టుకొచ్చాయి. నాకు జన్మనిచ్చినందుకు నాన్న విరాట్ కోహ్లి, అమ్మ అనుష్క శర్మకు ధన్యవాదాలు అంటూ అకాయ్ పేరిట ఓ పోస్ట్ ఎక్స్‌లో వైరలవుతోంది. కాగా విరాట్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
A cute ai generated family photo of Virushka
— ꧁Priyanshu꧁ (@Hey_ImPriyanshu) February 21, 2024
💖😍#Akaay #akaaykohli #ViratKohli #AnushkaSharma #Vamika pic.twitter.com/zq63tXinNM
AI images of akaay ❤️🔥#akaaykohli#Akaay#AnushkaSharma #ViratKohli pic.twitter.com/cre7GGmvna
— kikuuuuuu (@MemeCreatorrr) February 21, 2024

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
