టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ రేసులో అజయ్‌ రాత్రా  | Ajay Ratra in fray to become India fielding coach | Sakshi
Sakshi News home page

టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ రేసులో అజయ్‌ రాత్రా 

Oct 27 2021 3:51 PM | Updated on Oct 27 2021 3:51 PM

Ajay Ratra in fray to become India fielding coach - Sakshi

Teamindia fielding coach:  భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ అజయ్‌ రాత్రా దరఖాస్తు చేసుకున్నాడు. హరియాణాకు చెందిన 39 ఏళ్ల రాత్రా 6 టెస్టుల్లో, 12 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం అజయ్‌ రాత్రా అస్సాం జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. అంతేకాకుండా గతంలో అతడు భారత మహిళల జట్టు, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచింగ్‌ బృందంలో పనిచేశాడు. ‘అవకాశం ఇస్తే భారత క్రికెట్‌ జట్టు అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా’ అని రాత్రా వ్యాఖ్యానించాడు.

చదవండి: T20 World Cup 2021: పెను ప్రమాదం తప్పించకున్న పాక్‌ అంపైర్ .. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement