రోహిత్‌ను గుర్తు చేసిన కింగ్‌.. స్టేడియం బయటకు బంతి! వీడియో After 101 metre six, Brandon King forced off the field due to injury. Sakshi
Sakshi News home page

T20 WC: రోహిత్‌ను గుర్తు చేసిన కింగ్‌.. స్టేడియం బయటకు బంతి! వీడియో

Published Thu, Jun 20 2024 7:31 AM | Last Updated on Thu, Jun 20 2024 9:21 AM

After 101 metre six, Brandon King forced off the field due to injury

టీ20 వరల్డ్‌కప్‌-2024లో సెయింట్‌ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌  ఓపెనర్‌ బ్రాండెన్‌ కింగ్‌ అద్బుతమైన షాట్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో కింగ్‌ భారీ సిక్స్‌ కొట్టాడు. అతడు కొట్టిన షాట్‌కు బంతి 101 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయటపడింది. 

విండీస్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ రీస్‌ టాప్లీ తొలి రెండు బంతులను డాట్‌లగా వేశాడు. అనంతరం మూడో బంతిని స్టంప్స్‌ లైన్‌ దిశగా ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. బంతి స్లాట్‌లో ఉండడంతో కింగ్‌ మిడ్ వికెట్ మీదగా భారీ సిక్స్‌ బాదాడు. 

దెబ్బకు బంతి స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కాగా రోహిత్‌ కూడా అచ్చెం ఈ విధంగానే మిడ్‌ వికెట్‌ దిశగా ఈజీగా భారీ సిక్స్‌లు కొడుతుంటాడు. ఇక ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన కింగ్‌ దురదృష్టవశాత్తు రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement