
ఆంధ్ర అండర్–23 పురుషుల క్రికెట్ జట్టుకు వై.వెంకటేశ్ మేనేజర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్‌లకు మీడియా మేనేజర్‌గా కొనసాగుతున్న వెంకటేశ్... ఈ సీజన్‌లో అండర్–23 జట్టుతో కలిసి పనిచేయనున్నాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌లకు అతడు ఆంధ్ర జట్టు మేనేజర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రతినిధులు శనివారం వెంకటేశ్‌ను అభినందించారు. కొత్త పాత్రలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.
చదవండి: BAN vs AFG: ఐదేసిన రషీద్ ఖాన్.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్