ఏబీ డివిలియర్స్ ఊచకోత.. 37 బంతుల్లో మెరుపు సెంచరీ | AB De Villiers Rolls Back The Years At 42, Smashes 37-Ball Century As South Africa Champions Thrash Australia In WCL 2026 | Sakshi
Sakshi News home page

ఏబీ డివిలియర్స్ ఊచకోత.. 37 బంతుల్లో మెరుపు సెంచరీ

Oct 10 2026 11:30 AM | Updated on Oct 10 2026 12:19 PM

AB De Villiers Rolls Back The Years At 42, Slams 37-Ball Ton In Legends League

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026 టోర్నమెంట్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ వరుసగా రెండో విజయాన్ని అందించింది. శుక్రవారం షార్జా వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. డిఆర్సీ షార్ట్(66) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, డేవిడ్ వార్నర్(48), జో బర్న్స్‌(38) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రోటీస్‌ బౌలర్లలో హార్డస్ విల్జోన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

డివిలియర్స్ విధ్వంసం
అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ మిస్టర్ 360.. తనదైన ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికిపారేశాడు. కేవలం 37 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. 

మొత్తంగా 40 బంతుల్లో 6 ఫోర్లు,11 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు రిచర్డ్‌ లివీ(62) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఫలితంగా ఈ భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement