Ind Vs SL 1st Test: శ్రీలంకతో తొలి టెస్టు.. యువ ఓపెనర్‌కు నో ఛాన్స్‌..!

Aakash Chopra picks Indias playing XI for 1st Test - Sakshi

స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా.. ఇప్పడు టెస్ట్‌ సిరీస్‌కు సిద్దమైంది. మొహాలీ వేదికగా శుక్రవారం భారత్‌-శ్రీలంక మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఇక సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా దూరం కాగా, సీనియర్ బ్యాటర్లు రహానే,పుజారాలపై వేటుపడింది. గాయం కారణంగా కొన్నాళ్లుగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే తొలి టెస్టుకు భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ను టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్‌ చోప్రా అంచనా వేశాడు.

తన ప్రకటించిన జట్టులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మూడు, నాలుగు స్ధానాల్లో శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లికు అవకాశం ఇచ్చాడు. ఐదో స్ధానంలో హనుమా విహారిను ఎంపిక చేశాడు. తన జట్టులో ఆరో స్ధానంలో రిషబ్‌ పంత్‌, ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజాను ఎంచుకున్నాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌ చోటు దక్కింది. ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, సిరాజ్‌లకు చోటు ఇచ్చాడు. ఇక చోప్రా ప్రకటించిన జట్టులో యువ ఆటగాడు శుభమన్‌ గిల్‌కు చోటు దక్కలేదు.

 ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లి, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్ సిరాజ్

చదవండి: IND vs SA: భారత పర్యటనకు దక్షిణాఫ్రికా .. రోహిత్‌ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top