23rd April-Day-To-Forget for Virat Kohli Had 3-Golden Ducks-IPL Seasons - Sakshi
Sakshi News home page

#Apr 23rd-Kohli: ఏప్రిల్‌ 23.. కోహ్లికి కలిసిరాని రోజు!

Apr 23 2023 5:40 PM | Updated on Apr 23 2023 6:11 PM

23rd April-Day-To-Forget For Virat Kohli Had 3-Golden Ducks-IPL Seasons - Sakshi

Photo: IPL Twitter

ఏప్రిల్‌ 23.. ఆర్‌సీబీ స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఏ మాత్రం కలిసిరాని రోజుగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఈ తేదీన ఆర్‌సీబీ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడం గమనార్హం. మరో విచిత్రమేంటంటే.. ఏప్రిల్‌ 23న కోహ్లి గోల్డెన్‌ డక్‌ అయిన రెండు సందర్భా‍ల్లో ఆర్‌సీబీకి ఓటములే ఎదురయ్యాయి. మరి కోహ్లికి చీకటి రోజుగా మిగిలిపోయిన రెండు సందర్భాలను ఒకసారి చూసేద్దాం.

ఏప్రిల్‌ 23, 2017: ఆర్‌సీబీ వర్సెస్‌ కేకేఆర్‌
ఈ మ్యాచ్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చి తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. నాథన్‌ కౌల్టర్‌నీల్‌ బౌలింగ్‌లో మనీష్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ 82 పరుగులతో ఘన విజయం సాధించింది.

ఏప్రిల్‌ 23, 2022: ఆర్‌సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌
ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన కోహ్లి మరోసారి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు.  మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 68 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ 8 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

ఏప్రిల్‌ 23,2023: ఆర్‌సీబీ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌
తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆదివారం(ఏప్రిల్‌ 23న) రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లి మరోసారి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి బౌల్ట్‌ వేసిన తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. మరి ఈ మ్యాచ్‌ ఫలితం ఆర్‌సీబీకి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: చెత్త రికార్డు.. మొహం చూపించడానికి ఇష్టపడని కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement