Virat Kohli 7th Golden Duck In IPL History, Only Rashid-10 Golden Ducks - Sakshi
Sakshi News home page

#ViratKohli: చెత్త రికార్డు.. మొహం చూపించడానికి ఇష్టపడని కోహ్లి

Apr 23 2023 5:01 PM | Updated on Apr 23 2023 5:30 PM

Virat Kohli 7th Golden Duck In IPL History Only Rashid-10 Golden Ducks - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌ అయిన సంగతి తెలిసిందే. బౌల్ట్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగి ఆశ్చర్యపరిచాడు. అప్పటివరకు కోహ్లి నామస్మరణతో హోరెత్తిన చిన్నస్వామి స్టేడియం కోహ్లి ఔట్‌తో ఒక్కసారిగా మూగబోయింది. తాను ఔట్‌ అవ్వడంపై తీవ్ర నిరాశ చెందిన కోహ్లి కనీసం నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న డుప్లెసిస్‌ మొహం కూడా చూడకుండా తల కిందికేసుకొని వెళ్లిపోయాడు. 

ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్‌లో ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు గోల్డెన్‌ డకౌట్‌ అయిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి తాజా దానితో కలిపి ఏడుసార్లు గోల్డెన్‌డక్‌గా వెనుదిరగ్గా.. సునీల్‌ నరైన్‌, హర్బజన్‌ సింగ్‌లతో కలిసి కోహ్లి సంయుక్తంగా ఉన్నాడు. ఇక తొలి స్థానంలో గుజరాత్‌ టైటాన్స్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ పది గోల్డెన్‌ డకౌట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.

చదవండి: RCB VS RR: కోహ్లి గోల్డెన్‌ డక్‌.. మహిళా అభిమాని ఏం చేసిందంటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement