
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో మ్యాచ్‌ల కంటే హైలెట్‌గా నిలిచింది కోహ్లి-గంభీర్ మధ్య గొడవ. సిరాజ్, నవీన్ ఉల్ హక్‌లు గొడవకు ప్రధాన కారణమైనప్పటికి కోహ్లి, గంభీర్‌లు తమ చర్యతో హైలెట్‌గా మారారు. తొలిసారి 2013లో ఇదే ఐపీఎల్లో గొడవ పడిన ఈ ఇద్దరూ పదేళ్ల తర్వాత మరోసారి ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన గొడవ వీడియో గేమ్ రూపంలో రావడం ఆసక్తి కలిగించిది.
ఒక వ్యక్తి తన క్రియేటివిటీ ఉపయోగించి కోహ్లి-గంభీర్ గొడవను వీడియో గేమ్‌గా మలిచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కోహ్లి, గంభీర్ తమ ఐపీఎల్ జెర్సీల్లో కనిపిస్తారు. ఇద్దరూ చేతుల్లో బ్యాట్లు పట్టుకొని మొదట కాస్త వర్కౌట్స్ చేస్తారు. ఆ తర్వాత అటాక్ అంటూ ఒకరి టీమ్ పై మరొకరు దాడి చేస్తారు.
ముందు కోహ్లి, గంభీర్ బ్యాట్లతో కొట్టుకుంటే.. వాళ్ల వెనుక మిగతా ప్లేయర్స్ కూడా బాహాబాహీకి దిగుతారు. అలా కొద్దిసేపు కొట్టుకున్న తర్వాత ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కింద పడిపోతారు. లక్నో గెలిచినట్లుగా చూపించారు. ఈ సీజన్ ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ రెండుసార్లు పోటీ పడగా.. చెరొకసారి విజయం సాధించిన విషయం తెలిసిందే.
బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, లక్నోలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించాయి. అయితే మ్యాచ్ ఫలితం కంటే కూడా కోహ్లి, గంభీర్ గొడవే అభిమానులను ఎక్కువగా ఆకర్షించింది. దీంతో కొందరు ఔత్సాహికులు.. వీళ్ల గొడవనే ఇలా వీడియో గేమ్‌గా మార్చేశారు. గ్రౌండ్ లో కేవలం వీళ్లను గొడవను చూసి ఏమీ చేయలేకపోతున్నామే అనుకునే ఈ రెండు జట్ల అభిమానులు.. ఈ వీడియో గేమ్ ద్వారా ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కింది.
I made a game so that #ViratKohli and #GautamGambhir can fight properly.
— Aerø (@aeronzero) May 7, 2023
try it at: https://t.co/LnNCyatmMc #IPL2023 pic.twitter.com/SvTJPa27en