Fans Shocked Person Looks Like Same As Dhoni: 'MS Dhoni From 2040' - Sakshi
Sakshi News home page

#MSDhoni: ధోనిలా ఉన్నాడు.. 2040లో ఇదే జరగొచ్చు!

May 9 2023 6:04 PM | Updated on May 9 2023 10:05 PM

Fans Shocked Person Looks-Like Same-As-MS Dhoni Says Dhoni From 2040 - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌ సక్సెక్‌ క్రెడిట్‌లో కొంతభాగం సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి ఇవ్వాల్సిందే. కేవలం ధోని కోసమే ఈ సీజన్‌ను చూస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారు. ధోనికిదే లాస్ట్‌ సీజన్‌ అని రూమర్స్‌ వచ్చినవేళ అతని ఆటను చూడడం కోసం ఎగబడ్డారు. సీఎస్‌కే మ్యాచ్‌ ఆడుతుందంటే చాలు జియో సినిమాలో వీక్షకుల సంఖ్య సుమారు రెండుకోట్లు ఉంటుంది.

అయితే లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా టాస్‌ సమయంలో ధోని తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. ఇదే నా చివరి ఐపీఎల్‌ అని మీరు డిసైడ్‌ అయ్యారు.. నేను కాదు అంటూ తెలివైన సమాధానం ఇచ్చాడు. దీన్నిబట్టి ధోని రిటైర్మెంట్‌ ఈ సీజన్‌లో మాత్రం ఉండే అవకాశం లేదని అర్థమయింది.

ఈ సంగతి పక్కనబెడితే సోషల్‌ మీడియాలో ధోనికి సంబంధించిన ఒక ఫోటో చక్కర్లు కొడుతుంది. నెరిసిన గడ్డం.. సీఎస్‌కే జెర్సీ.. అవే చూపులతో స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌ చూస్తున్న ఒక అభిమాని అచ్చం ధోనిలా కనిపించాడు . దూరం నుంచి చూస్తే అరె నిజంగా ధోనినే అనిపిస్తోంది. అయితే ఫ్రేమ్‌లో ఆ వ్యక్తి కాస్త పక్కకు జరగ్గానే ముఖ కవళికల్లో మార్పు కనిపించింది. ఈ సీజన్‌లో సీఎస్‌కే, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన 41వ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది.

అయితే ఆ ఫోటోను తీసిన ఒక అభిమాని ట్విటర్‌లో షేర్‌ చేయగా.. ఒక అభిమాని తనదైన శైలిలో క్యాప్షన్‌ పెట్టాడు. ''టైమ్‌ ట్రావెల్‌లో ముందుకెళ్లి చూడండి.. 2040లో ధోని ఇలాగే ఐపీఎల్‌ మ్యాచ్‌ను చూస్తూ ఉంటాడు.. ఆ అద్బుత దృశ్యం 18 ఏళ్ల ముందే కనిపించింది'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: 'రింకూ లాంటి ఫినిషర్‌ ఉండగా.. టెన్షన్‌ ఎందుకు దండగ'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement