సేవలు కామ్‌! | - | Sakshi
Sakshi News home page

సేవలు కామ్‌!

Nov 10 2026 8:27 AM | Updated on Nov 10 2026 8:27 AM

అమలయ్యేలా చూస్తాం

జిల్లాలో నామమాత్రంగా అమలు

ఈ–నామ్‌..

గజ్వేల్‌: వ్యవసాయ మార్కెట్లలో ‘ఈ– నామ్‌ (నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌)–2.0’ అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో రైతుల ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాల సేకరణ, వారి ఫోన్‌ నంబర్‌, ఓటీపీల ఆధారంగానే లావాదేవీలు జరపాలని కొత్తగా నిర్ణయించారు. దీని ద్వారా కొంత పారదర్శకత పెరగడమే కాకుండా, మెరుగైన ధరలు కూడా లభిస్తున్నాయి. కానీ ఈ విధానంపై రైతుల్లో అవగాహన కొరవడి లావాదేవీలు అత్యల్పంగా సాగుతున్నాయి. ఇకపోతే రాష్ట్రంలోని, దేశంలోని ప్రముఖ మార్కెట్ల అనుసంధానం అంశం కూడా పెండింగ్‌లోనే ఉండగా, కొనుగోళ్ల ప్రక్రియ గతంలో మాదిరిగానే స్థానిక మార్కెట్లకే పరిమితమయ్యింది.

జిల్లాలో గజ్వేల్‌, సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, తొగుట, దౌల్తాబాద్‌, కొండపాక, మిరుదొడ్డి, దుబ్బాక, బెజ్జంకి, హుస్నాబాద్‌, కొహెడ, చేర్యాల, వంటిమామిడి మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటిల్లో వంటిమామిడి మార్కెట్‌ కూరగాయల క్రయవిక్రయాలకే పరిమితంకాగా మిగతా మార్కెట్లలో.. పత్తి, వరి, మొక్కజొన్న ఇతర వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు సాగుతుంటాయి. గజ్వేల్‌, సిద్దిపేట, హుస్నాబాద్‌ మార్కెట్లలో మాత్రంగా ‘ఈ–నామ్‌’ విధానం.. కొన్నేళ్లుగా నామమాత్రంగా అమల్లో ఉంది. గజ్వేల్‌లో మార్కెట్లలో 58మంది లైసెన్స్‌ పొందిన వ్యాపారులు, 9మంది కమీషన్‌ ఏజెంట్లు ఉండగా.. ఈ–నామ్‌ ద్వారా పత్తి, మక్కల కొనుగోళ్లను జరుపుతుంటారు. పత్తికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.8667 ఉండగా, గత నెల 31న ‘ఈ–నామ్‌–2.0’ ద్వారా జరిగిన లావాదేవీల్లో రైతులకు గరిష్టంగా రూ.9160 ధర దక్కింది. మక్కలకు రూ.2410 ఽమద్దతు ఉండగా, అంతకు మించి రూ.3060 చెల్లించారు. ఇలా ఏ రకంగా చూసినా రైతులకు ధర విషయంలో మేలు జరుగుతున్నది.ఇకపోతే కొత్తగా తీసుకొచ్చిన విధానంలో రైతుల ఆధార్‌, బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ, ఫోన్‌ నంబర్‌, ఓటీపీలతో లావాదేవీలు జరపాలని నిర్ణయించారు. కానీ పత్తి విక్రయాలు 10క్వింటాళ్లలోపు, మక్కల కొనుగోళ్లు 5క్వింటాళ్లలోపు మాత్రమే జరిగాయి. అదే రోజు బహిరంగ మార్కెట్‌లోని జిన్నింగ్‌ మిల్లులు, వ్యాపారుల వద్ద పత్తి కొనుగోళ్లు వేలాది క్వింటాళ్లల్లో జరిగాయి. మక్కలు సైతం వేలాది క్వింటాళ్ల క్రయవిక్రయాలు జరిగాయి. ఈ విధానంపై రైతుల్లో అవగాహన లేక, ‘ఈనామ్‌–2.0’ అమల్లో ఉన్న మార్కెట్‌లకు ఉత్పత్తులు తెచ్చి అమ్ముకోవడం లేదు.

అనుసంధానం లేక..

ఈ విధానం రాష్ట్రంలోని ప్రముఖ మార్కెట్‌లు, దేశంలోని ప్రముఖ మార్కెట్లతో అనుసంధానం ఉంటే మరింత మేలు జరిగేది. మార్కెట్లను దేశ, రాష్ట్రస్థాయిలో అనుసంధానం చేయాలంటే దానికి సౌకర్యాల కల్పన, ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన కమీషన్‌ ఏజెంట్లు ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో సరుకులను పరిశీలించిన తర్వాత లావాదేవీలు జరపాల్సి ఉన్నది. కానీ అంతటి యంత్రాంగం ఇప్పట్లో సమకూరే కనిపించడం లేదు. దీనివల్ల పూర్తిస్థాయి అనుసంధానం కలగానే మిగిలింది.

ఇదీ ఈ–నామ్‌ విధానం...

‘ఈ–నామ్‌–2.0’ మంచి విధానం. దీని ద్వారా రైతులు పండించిన ఉత్పత్తులకు మెరుగైన ధర అందే అవకాశముంది. రైతుల్లో అవగాహన పెంచి ఈ విధానం సక్రమంగా అమలయ్యేలా చూస్తాం.

– ప్రకాశ్‌, మార్కెటింగ్‌ శాఖ ఏడీ

స్థానిక మార్కెట్లకే పరిమితం

రైతుల్లో కొరవడిన అవగాహన

క్రయవిక్రయాల తీరులో మార్పులు

పూర్తిస్థాయి అనుసంధానం సైతం పెండింగ్‌లోనే...

వ్యాపారుల్లో పోటీతత్వాన్ని పెంచి రైతులకు మద్దతు ధరకు మించిన మెరుగైన గిట్టుబాటు ధర అందించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం.‘ఈ–నామ్‌’లో వ్యాపారులు పోటాపోటీగా ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా ధరలను కోట్‌ చేయడం వల్ల అధికంగా వేసిన వ్యాపారికి ఉత్పత్తులు దక్కుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 54కిపైగా మార్కెట్‌ కమిటీల్లో ఈ–నామ్‌ అమల్లో ఉంది. ఇందులో కొన్ని ప్రధాన మార్కెట్లకూ దేశంలోని ప్రముఖ మార్కెట్లకు అనుసంధానం చేసి...లావాదేవీలు జరిగేలా చూడాల్సి ఉన్నది. ఉదాహరణకు హర్యానా మార్కెట్‌లో ఉన్న ఓ వ్యాపారికి ఇక్కడి ఉత్పత్తులు నచ్చితే.. ఈనామ్‌ ద్వారా కొనుగోలు చేసి మంచి ధర చెల్లించే అవకాశముంది. కానీ రాష్ట్రంలోని కొన్ని మార్కెట్లకు మాత్రం స్థానిక స్థాయిలోనే అవకాశం కల్పించారు. దీనివల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement