జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్
సిద్దిపేటకమాన్: ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందించడమే లక్ష్యమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్, న్యాయ సేవాధివాకార సంస్థ సెక్రటరీ సౌజన్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన పేద, బలహీన వర్గాల ప్రజలందరికీ ఉచితంగా న్యాయం సహాయం అందుతోందన్నారు. సివిల్, క్రిమినల్ వివాదాల్లో ప్రజలకు అవసరమైన న్యాయ సహాయాన్ని సంస్థ అందిస్తోందన్నారు. కోర్టు వివాదాలను కక్షిదారుల మధ్య సామరస్యపూర్వకంగా అతి త్వరగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కల్పిస్తున్న ఉచిత న్యాయ సేవలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 11న కోర్టు ప్రాంగణం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించి, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కోన్నారు.
హుస్నాబాద్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పరీక్ష ఫీజులు చెల్లించి ఆర్థికంగా అండగా నిలిచారు. జిల్లాలో ఉన్న హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న 1,133 మంది విద్యార్థుల పరీక్ష ఫీజు రూ.1,37,140 విద్యాశాఖ అధికార ఖాతకు బదిలీ చేసినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బండి సంజయ్ పంపిన అధికారిక పత్రాలను కలెక్టర్ హైమావతికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, బీజేపీ నాయకులు రాంగోపాల్ రెడ్డి, ఖమ్మం వెంకటేశంతో కలిసి అందజేశారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృషి సారించారని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నర్సాపూర్‌లోని పురాతన గ్రంథాలయాన్ని సందర్శించారు. అనంతరం స్థానిక పాఠశాలలో, కాలనీలో సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో కావాల్సిన అన్ని రకాల పుస్తకాలను సమకుర్చామన్నారు. గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు నిరుద్యోగులు గ్రంథాలయాల్లో సన్నద్ధత కావాలన్నారు. కార్యక్రమంలో పాండు, నిజాముద్దీన్, వంగపల్లి అశోక్, యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధిగా శ్రీకాంత్‌రావు
గజ్వేల్: నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావుకు పదోన్నతి కల్పించారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆదేశాల మేరకు బండారు శ్రీకాంత్‌రావును సీనియర్ అధికార ప్రతినిధిగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి పదోన్నతి కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, అధిష్టానానికి బండారు కృతజ్ఞతలు తెలిపారు.
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులు చదువుకునే దశ నుంచే శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించుకోవాలని జిల్లా విద్యాధికారి రమేశ్ విద్యార్థులకు సూచించారు. సోమవారం టీటీసీ భవన్లో నిర్వహించిన జాతీయ బాలల సైన్స్ సమావేశంలో వివిధ పాఠశాలల నుంచి యువ శాస్త్రవేత్తలు పాల్గొని వారు రూపొందించిన పాజెక్టులను జూరీ సభ్యుల ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ రమేశ్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాసీ్త్రయ ఆలోచనలను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో జూరి సభ్యులు మధుసూదన్, ఏడీ. శాస్త్రి, ఏఎంఓ పయ్యావుల రామస్వామి, డీఎస్ఓ పబ్బోజు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.


