● కలెక్టర్ హైమావతి
● ప్రజావాణికి వచ్చిన వినతులు 81
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం అందించిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అర్హతల మేరకు వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. డివిజన్, మండల స్థాయిలో కొనసాగుతున్న ప్రజావాణిలో స్వీకరిస్తున్న అర్జీలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 81 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, డీఆర్ఓ నాగరాజమ్మ, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
సైకిల్ ఇప్పించండి.. గుర్తింపు తెస్తా..
సహకారం అందిస్తే ఛాంపియన్షిప్లో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న పచిమట్ల రవళి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటికే జాతీయ స్థాయి సైక్లింగ్ ఈవెంట్లలో ఆరు సార్లు తెలంగాణకు ప్రాతినిథ్యం వహించానన్నారు. పంజాబ్లో ఈనెల 18 నుంచి 21 వరకు నిర్వహించే అఖిల్ భారత అంతర్వి శ్వవిద్యాలయ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపకయ్యానన్నారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో అవసరమైన ప్రొఫెషనల్ సైక్లింగ్ పరికరాలు, ప్రయాణ, వసతి ఖర్చులను భరించలేకపోతున్నాని తెలిపారు.


