బియ్యం ధరలకు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

బియ్యం ధరలకు బ్రేక్‌

Nov 10 2026 8:27 AM | Updated on Nov 10 2026 8:27 AM

● జిల్లా కేంద్రంలో రైస్‌ కౌంటర్‌

● అధికార యంత్రాంగం చర్యలు

సిద్దిపేటజోన్‌: ప్రజలకు అందుబాటులోకి బియ్యం ధరలు ఉండేలా జిల్లా యంత్రాంగం పూర్తి చర్యలు చేపట్టినట్లు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి శివరంజని తెలిపారు. సోమవారం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డులో ప్రత్యేక రైస్‌ కౌంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు బియ్యం ధరలు అందుబాటులో ఉండేలా రైస్‌ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కౌంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ నిర్దేశించిన ధరలకే అమ్మేందుకు వ్యాపారులు ముందుకు రావడంతో ప్రత్యేకంగా రైస్‌ కౌంటర్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీపీటీ కొత్త బియ్యం కిలో రూ.53 చొప్పున 26 కిలోల బస్తా బియ్యం రూ.1,378. అలాగే బీపీటీ స్టీమ్‌ బియ్యం కిలో రూ. 64 చొప్పున 26 కిలోల బియ్యం రూ.1,664. అదేవిధంగా హెచ్‌ఎంటీ స్టీమ్‌ కిలో రూ.72చొప్పున 26 కిలోల బియ్యం రూ.1,872. మరోవైపు జేఎస్‌ఆర్‌ స్టీమ్‌ కిలో రూ.78 చొప్పున. 26 కిలోల బస్తా బియ్యం ధర రూ.2,028 లకే రైస్‌ కౌంటర్‌లో అమ్మనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement