ప్రతీ పేదకుటుంబానికి సొంతిల్లు | - | Sakshi
Sakshi News home page

ప్రతీ పేదకుటుంబానికి సొంతిల్లు

Nov 10 2026 8:27 AM | Updated on Nov 10 2026 8:27 AM

● మంత్రి పొన్నం ప్రభాకర్‌

● ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): ప్రతీ పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు పుల్లూరి వీరమ్మ నూతన గృహ ప్రవేశ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నూతన వస్త్రాలు అందజేసి, స్వీట్లు పంచి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందన్నారు. పదేళ్లుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు లేకపోవడంతో ఇళ్ల కోసం డిమాండ్‌ భారీగా పెరిగిందన్నారు. అయిన్నప్పటికీ అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందేలా స్థానిక నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వచ్చే దీపావళి నాటికి రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను కూడా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పాండ్రాల దాము, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్‌గౌడ్‌, డివిజన్‌ ఆత్మ కమిటీ చైర్మన్‌ జంగపల్లి ఐలయ్య, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పాలనలోనే సాకారం...

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): కోహెడ మండలం వింజపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారు పారునంది శంకరవ్వ నూతన గృహ ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈసందర్భంగా శంకరవ్వ కుటుంబ సభ్యులతో కలిసి పొన్నం దీపావళి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేరుస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందన్నారు. శంకరవ్వకు నూతన వస్త్రలు అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అన్నాడి శ్రీజజీవన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నిర్మలాజయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement