ఎలుగుబంటి సంచారంపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటి సంచారంపై అప్రమత్తం

Nov 6 2026 11:27 AM | Updated on Nov 6 2026 11:27 AM

అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి అరుణ హెచ్చరిక

బెజ్జంకి(సిద్దిపేట): తలారివానిపల్లె శివారు ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తున్నందున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి అరుణ సూచించారు. మండలంలోని తలారువానిపల్లె పరిసర ప్రాంతంలో ఎలుగుబంటి సంచరించిన ప్రాంతాన్ని గురువారం ఆమె పరీశీలించారు. రైతులు పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో అటవీ బీట్‌ అధికారి శ్రవణ్‌, సర్పంచ్‌ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రిలో పాము కలకలం

దుబ్బాకరూరల్‌: మండలంలోని తిమ్మాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం పాము కలకలం రేపింది. ప్రతీ రోజు ఉదయం ఆస్పత్రికి రోగులు వస్తుంటారు. ఆస్పత్రి లోపల రూమ్‌లో ఉన్న ఏసీ ప్రక్కనే పాము కనిపించడంతో అందులో ఉన్న రోగులు బయటకు పరుగులు తీశారు. సర్పంచ్‌ శ్రీనివాస్‌ ఆస్పత్రికి చేరుకుని పామును చంపించారు. గతంలో రెండుసార్లు ఇదే పాము ఆస్పత్రిలోకి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఆస్పత్రి చుట్టూ ప్రహరీ లేకపోవడంతోనే పాములు వస్తున్నాయి. ఆస్పత్రి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement