వీధుల్లో కుక్కలు విచ్చల విడిగా తిరుగుతూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇళ్లపై కోతులు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇళ్లను పీకి పందిరేస్తున్న కోతులు.. వీధుల్లో వీరవిహారం చేస్తున్న కుక్కలతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అయినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిరుదొడ్డిలో వీధుల్లో తిరుగుతున్న శునకాలను, ఇళ్లపై సంచరిస్తున్న కోతులను బుధవారం ‘సాక్షి’ కెమెరా ఇలా క్లిక్ మనిపించింది.
– మిరుదొడ్డి(దుబ్బాక)
ఇంటిపై సంచరిస్తున్న కోతులు


