జలం.. పాతాళం | - | Sakshi
Sakshi News home page

జలం.. పాతాళం

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

జలం.. పాతాళం

2025 2026

జిల్లాలో గతేడాది అక్టోబర్‌లో భూగర్భ జలాలు సగటున 6.43మీటర్ల లోతులో ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌లో 9.75మీటర్లకు చేరింది. అంటే గతేడాదితో పోలిస్తే 3.32మీటర్ల కిందకు భూగర్భజలాలు పడిపోయాయి. గత నెలలో సగటు 9.68మీటర్లు ఉండగా ఈ నెల 9.75మీటర్లకు చేరింది. నెల వ్యవధిలోనూ 0.07మీటర్ల తగ్గుదల నమోదైంది. భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడంతో నీటిపై ఆధారపడే ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని 26 మండలాల్లో 18 మండలాలు సాధారణ స్థితిలో ఉన్నాయి. మధ్యస్థంగా సిద్దిపేట అర్బన్‌, మద్దూరు. దూల్మిట్ట మండలాలు, తేలికపాటి స్థితిలో చేర్యాల, కొండపాక, మర్కూక్‌, నంగునూరు, వర్గల్‌ మండలాలు ఉన్నాయి.

పదేళ్ల సగటును మించి కిందికి..

జిల్లాలో పదేళ్ల సగటును మించి 14 మండలాల్లో భూగర్భ జలాలు కిందకు పడిపోయాయి. సిద్దిపేట అర్బన్‌లో గత అక్టోబర్‌ నెల సగటు భూ గర్భ జలాలు 7.71మీటర్లు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుత అక్టోబర్‌ చివరి నాటికి ఏకంగా 12.62 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే పదేళ్ల సగటు పోలిస్తే 4.91 మీటర్ల లోతుకు పడిపోయాయి. దూల్మిట్ట మండలంలో పదేళ్ల సగటు 10.26 మీటర్లు ఉండగా ప్రస్తుతం 15.65 మీటర్ల కనిష్ట స్థాయికి పడిపోయి 5.39మీటర్ల లోతుకు చేరాయి. మర్కూక్‌ మండలంలో దశాబ్దపు సగటు 15.86మీటర్లు ఉండగా ఏకంగా 21.72 మీటర్ల లోతుకు చేరాయి. దీంతో 5.86మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. నంగునూరు, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, అక్బర్‌పేట–భూంపల్లి, జగదేవ్‌పూర్‌, కొండపాక, వర్గల్‌, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లో సైతం జలాలు పడిపోయాయి.

ఇంకుడు గుంతలు అవసరం

ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు నీటిని భూమిలోకి ఇంకించే నిర్మాణాలు చేయడం అవసరం. ఇంకుడు గుంతలు, ఫాంపండ్‌ల నిర్మాణాలు చేయడం వల్ల గ్రౌండ్‌ వాటర్‌ను పెంచుకునే అవకాశం ఉంది.

భూగర్భ జలాలపై ఎల్‌నినో పంజా విసురుతోంది. పదేళ్లలో సగటుతో పోలిస్తే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. ఎండలు మండుతుండటం.. వానలు ముఖం చాటేయడం.. బోర్ల వినియోగం పెరగడంతో భూమి పొరల్లో ఉన్న నీళ్లు కిందకు వెళ్తున్నాయి. నెలనెలా పడిపోతున్న నీటిమట్టంతో జనాల్లో భవిష్యత్తుపై బెంగ పెరుగుతోంది. చెరువులు, రిజర్వాయర్లలో ఉన్న నీళ్లు ఎండ తీవ్రతకు ఆవిరవుతున్నాయి. నీటిని పొదుపుగా వినియోగించుకోకపోతే రానున్న రోజుల్లో సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి.

– సాక్షి, సిద్దిపేట

భూగర్భ జలాలపై ఎల్‌నినో ఎఫెక్ట్‌

పదేళ్ల సగటుతో పోలిస్తే మరింత లోతుకు..

14 మండలాల్లో తీవ్రం

గతేడాది కంటే 3.32 మీటర్లకు పడిపోయిన జలాలు

నీటి పొదుపు తప్పనిసరి

జిల్లాలో జలాలు (మీటర్ల లోతులో..)

మండలం అక్టోబర్‌ అక్టోబర్‌

చిన్నకోడూరు 4.51 9.42

సిద్దిపేట రూరల్‌ 7.71 10.48

సిద్దిపేట అర్బన్‌ 6.69 12.62

నంగునూరు 4.17 7.39

నారాయణరావుపేట 9.73 12.22

దౌల్తాబాద్‌ 17.51 18.29

దుబ్బాక 13.34 17.61

రాయపోల్‌ 5.13 8.05

మిరుదొడ్డి 11.16 12.94

అక్బర్‌పేట–భూంపల్లి 13.33 17.65

గజ్వేల్‌ 6.48 9.44

జగదేవ్‌పూర్‌ 5.10 9.78

ములుగు 14.22 16.65

కుకునూరుపల్లి 9.48 12.02

మర్కూక్‌ 6.74 21.72

అక్కన్నపేట 7.26 8.03

చేర్యాల 4.06 8.33

మద్దూరు 5.65 10.72

దూల్మిట్ట 7.92 15.65

ప్రత్యామ్నాయ పంటలే మేలు

యాసంగిలో వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలి. ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలి. రైతులు ఫాంపండ్‌లు, ఇంకుడు గుంతలు, బోర్‌ రీచార్జ్‌లు నిర్మించుకోవాలి. బోర్లు వేసుకునేవారు తప్పనిసరిగా భూగర్భ జలశాఖ అనుమతులు తీసుకోవాలి. అనుమతి లేకుండా బోర్‌లు వస్తే జరిమానాలు తప్పవు.

– నాగరాజు, ఏడీ, గ్రౌండ్‌ వాటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement