మూడేళ్లలో ఒక్కపనీ జరగలే.. | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో ఒక్కపనీ జరగలే..

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

సిద్దిపేటజోన్‌: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో మూడేళ్లలో ఒక్క అభివృద్ధి పనిచేసింది లేదని, పంచాయతీ రాజ్‌ శాఖ కింద రూ.300 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్‌ శాఖ పనితీరుపై ఆరా తీశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మంజూరైన పనులను రద్దు చేశారన్నారు. వాటిని రద్దు చేసిన ప్రభుత్వం మూడేళ్లలో ఒక్క కొత్త రోడ్డు వేసింది లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో అంగన్వాడీ, మహిళా భవనాలు, పంచాయతీ కార్యాలయ భవన పనులను, సీసీ రోడ్డు పనుల్లో వేగవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా హ్యామ్‌ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో రూ.50కోట్ల పనులు పూర్తి చేయాలన్నారు.

సమైక్య రాష్ట్ర పరిస్థితి పునరావృతం

సంక్షేమ హాస్టళ్లు దయనీయంగా మారాయని, ఒకప్పటి సమైక్య రాష్ట్ర పరిస్థితి పునరావృతం అవుతోందని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్లు క్షేమంగా ఉండగా, నేడు సంక్షోభంలో పడ్డాయని విమర్శించారు. ఆరు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫామ్స్‌ లేవని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క జత మాత్రమే ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే మిగతా మూడు జతలు ఇవ్వాలని సూచించారు. నేటివరకు కాంట్రాక్టర్ల టెండర్‌ ఫైనల్‌ కాకపోవడంతో నిత్యావసర సరుకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. కాస్మొటిక్‌ చార్జీలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలో బ్రేక్‌ ఫాస్ట్‌ పథకం ఎలా అమలు అవుతుందో.. అలాగే మిగతా ప్రాంతాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా విద్యార్థుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని హాస్టళ్ల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డిగ్రీ కళాశాలలో సీట్లు వచ్చి హాస్టళ్లలో సీటు రాక 600మంది విద్యార్థులు టీసీ తీసుకొని వెళ్లినట్లు పేర్కొన్నారు. హాస్టల్‌ను వినియోగంలోకి తేవాలని సూచించారు. సమావేశంలో పంచాయతీ రాజ్‌, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, పాల్గొన్నారు.

సమీక్ష లో మాజీ మంత్రి హరీశ్‌రావు

రోడ్లను బాగుచేసింది లేదు..

సంక్షోభంలో సంక్షేమ హాస్టళ్లు

బ్రేక్‌ పాస్ట్‌ పథకంలో సిద్దిపేటపై నిర్లక్ష్యం

అధికారులతో మాజీ మంత్రి హరీశ్‌రావు సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement