రక్తదానం ప్రాణదానంతో సమానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం ప్రాణదానంతో సమానం

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

● సీపీ రష్మీ పెరుమాళ్‌

● పోలీసు కమిషనరేట్‌లో రక్తదాన శిబిరం

సిద్దిపేటకమాన్‌: రక్తదానం ప్రాణదానంతో సమానమని పోలీసు కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు కమిషనరేట్‌లో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించి అమరులైన పోలీసు సిబ్బంది త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అత్యవసర సమయాల్లో రక్తదానం చేయడం వల్ల విలువైన ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి రక్తదానం చేయడానికి స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 186యూనిట్లు సేకరించినట్లు బ్లడ్‌ బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ శ్రావణి తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగీత, పాథాలజీ విభాగ హెచ్‌ఓడీ డాక్టర్‌ స్మితారెడ్డి, బ్లడ్‌ బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రావణి సమన్వయంతో బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు కుశాల్కర్‌, సుభాష్‌చంద్రబోస్‌, ఏసీపీ రవిందర్‌రెడ్డి, మహిళా పోలీసు స్టేషన్‌ సీఐ దుర్గ, పోలీసు అధికారులు, సిబ్బంది, బ్లడ్‌ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

కమిషనరేట్‌ పరిధిలో స్పెషల్‌ డ్రైవ్‌

సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తమ సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘింస్తూ వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై 500కు పైగా కేసులు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపుతూ పట్టుబడిన వారిపై 77, అతివేగం 91, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 205, నెంబర్‌ ఫ్లేట్‌ లేకపోవడం 42, హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 35, వాహన పత్రాలు లేని వారిపై 28తో పాటు ఇతర నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించి, ప్రజల భద్రతను కాపాడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement