● డీఆర్‌ఓ నాగరాజమ్మ ● కలెక్టరేట్‌లో జయంతి వేడుకలు
సిద్దిపేటరూరల్: బహుజనుల వీరుడు పండుగ సాయన్న అని, వారి అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజుమ్మ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిజాం కాలంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక చరిత్రఅని, ఆధిపత్య శక్తులపై యుద్ధం చేసే క్రమంలో ప్రజల ను చైతన్యపరిచారన్నారు. ముదిరాజ్ ప్రముఖులు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియా డారు. కార్యక్రమంలో జిల్లా బీసీసంక్షేమ శాఖ అధికారి సయ్యద్ రఫిక్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఏవో రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అన్యాయాలను ఎదురించిన ధీరుడు
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రజా పోరాట యోధుడు పండుగ సాయన్న జయంతిని గురువారం చిన్నకోడూరులో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన నిలబడి అన్యాయాలను ఎదురించిన ప్రజా వీరుడని కొనియాడారు. నాయకులు వెంకటేశం, పాపయ్య, యాట యాదగిరి, దేవయ్య, బాలయ్య తదితరులు ఉన్నారు.
అధికారికంగా నిర్వహించడం అభినందనీయం
గజ్వేల్‌రూరల్: పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని హైకోర్టు న్యాయవాది కొట్టాల యాదగిరి అన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ(పల్లెపహాడ్)లో పండుగ సాయన్న జయంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాయన్న అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఊపిరి పోశాడని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో పల్లెపహాడ్ ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.


