సాగుకు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాల్సిందే | - | Sakshi
Sakshi News home page

సాగుకు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాల్సిందే

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

విద్యుత్‌ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

విద్యుత్‌ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

చేర్యాల(సిద్దిపేట): నిరంతరాయంగా రైతులకు నాణ్యమైన త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్‌ చేశాడు. గురువారం స్థానిక సీపీఎం కార్యాలయం నుంచి విద్యుత్‌ ఏడీఈ కార్యాలయం వరకు పట్టణ, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఏడీఈ వెంకట్‌గౌడ్‌కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతాంగానికి నాణ్యమైన 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు రోజుకు ఏడు ఎనిమిది గంటలు కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. పంట చేతికి వచ్చే సమయంలో కరెంటు సరిగా రాకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని, రైతుకు కనీసం పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన త్రీ ఫేస్‌ కరెంటును సరఫరా చేయాలన్నారు. ఎండిన పంటపొలాలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి వరి, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలకు ఎకరాకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సత్తిరెడ్డి, వెంకట్‌ మావో, యాదగిరి, కృష్ణారెడ్డి, అరుణ్‌, నాగరాజు, రవీందర్‌, షఫీ, శ్రీనివాస్‌, శోభ, కనకవ్వ, శ్రీహరి, మల్లేశ్‌, ప్రభాకర్‌, కనకయ్య, ఇస్తారి, సాయిలు, శ్రీకాంత్‌, విజయ్‌, ఆగంరెడ్డి, నర్సింహారెడ్డి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

దుబ్బాక ఏడీఈ ఆఫీస్‌ ఎదుట..

దుబ్బాక: వ్యవసాయరంగానికి నిరంతరం విద్యుత్‌ అందిచాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం దుబ్బాక విద్యుత్‌ ఏడీఈ కార్యాలయం ఎదుట సీసీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సబ్‌ ఇంజనీర్‌ రవళికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ కోతల వల్ల చివరి దశలో ఉన్న వరిపంటలకు నిరందక ఎండిపోతున్నాయన్నారు. ఎన్నికల ముందు 24 గంటల కరెంట్‌ ఇస్తామని చెప్పి కనీసం 7 గంటలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. చివరి దశలోఉన్న పంటలకు కరెంట్‌ సక్రమంగా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సాజిద్‌, కొంపల్లి భాస్కర్‌, రేణుక, శ్యామవ్వ, మహేశ్‌, లక్ష్మీనర్సయ్య, రవీందర్‌, దేవయ్య, రాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement