ముసుగేసి.. తాళ్లతో కట్టి.. | - | Sakshi
Sakshi News home page

ముసుగేసి.. తాళ్లతో కట్టి..

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

దుబ్బాకటౌన్‌: పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి ముసుగు వేసి, తాళ్లతో కట్టి ఉంచడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహం ఉన్న విషయం విదితమే. ఇటీవల చౌరస్తాలోని దిమ్మెను చిన్నదిగా చేయడం, నూతన విగ్రహాన్ని తాళ్లతో బంధించడంపై పలువురు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే ఇందిరాగాంధీ విగ్రహానికి ఈ దుస్థితి ఏమిటని పలువురు మండిపడుతున్నారు. దాదాపు నెల రోజులుగా ఈ విగ్రహం ఇలా ఉండటం గమనార్హం.

టాస్క్‌ ఫోర్స్‌ అధికారుల తనిఖీలు!

మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె శివారులో ఉన్న భారతీ ఇండస్ట్రీ రైస్‌ మిల్లులో స్టేట్‌ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తనిఖీలో భాగంగా రైస్‌ మిల్లులో పీడీఎఫ్‌ బియ్యం నిలువలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ విషయంపై భూంపల్లి ఎస్‌ఐ రాజశేఖర్‌ను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు.

బీజేపీ అధికార ప్రతినిధులుగా వంశీకృష్ణ, శ్రీనివాస్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులుగా పల్లె వంశీకృష్ణ గౌడ్‌, పొన్నం శ్రీనివాస్‌ ముదిరాజ్‌లను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు భైరిశంకర్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అధికార ప్రతినిధులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎంపీ రఘునందన్‌ రావు, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో విద్యార్థులు పాల్గొనాలి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సేవా ఫస్ట్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌–2026లో ప్రతి పాఠశాల విద్యార్థులు పాల్గొని వినూత్న ప్రాజెక్టులు సమర్పించాలని జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి రమేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 24లోగా ప్రతి పాఠశాల నుంచి కనీసం ఒక ప్రాజెక్టును తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, భద్రత తదితర అంశాలపై ప్రాజెక్టులు సమర్పించాలన్నారు. ఎంపికైన ప్రాజెక్టులు జాతీయ స్థాయి ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు.

వంశీకృష్ణ గౌడ్‌

పొన్నం శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement