చికిత్స అందిస్తే కుష్ఠు పూర్తిగా నయం | - | Sakshi
Sakshi News home page

చికిత్స అందిస్తే కుష్ఠు పూర్తిగా నయం

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

● లక్షణాలుంటే గుర్తించి, చికిత్స తీసుకోవాలి ● డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌

● లక్షణాలుంటే గుర్తించి, చికిత్స తీసుకోవాలి ● డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌

సిద్దిపేటకమాన్‌: చికిత్స అందిస్తే కుష్ఠు వ్యాధి పూర్తిగా నయమవుతుందని, వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే గుర్తించి చికిత్స పొందాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌ తెలిపారు. జిల్లాలో కుష్ఠు వ్యాధి కేసుల గుర్తింపు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. సిద్దిపేటలో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా సందర్శించి, సర్వే నిర్వహణ తీరు, ప్రజలకు అందిస్తున్న అవగాహనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు 14రోజుల పాటు కుష్ఠు వ్యాధి కేసుల గుర్తింపు సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పిస్తూ, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. అనుమానితులను సమీప ఆరోగ్య కేంద్రానికి పంపించి వైద్య పరీక్షల అనంతరం అవసరమైన చికిత్స అందిస్తారని తెలిపారు. వ్యాధి ప్రారంభ లక్షణాల్లో చర్మంపై స్మర్శజ్ఞానం తగ్గిన మచ్చలు, చేతులు, కాళ్లలో తిమ్మిరి వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కుష్ఠు వ్యాధి చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement