భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

సిద్దిపేటరూరల్‌: ఎంపిక చేసిన గ్రామాల్లో భూ భారతి రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టా లని అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో రెవెన్యూ అధికారులతో వివిధ అంశాలపై అదనపు కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ రీసర్వేకు సంబంధించి న రోజువారి వివరాలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. ముందుగా గ్రామ సరిహద్దులు సర్వే చేయాలని, సర్వే చేసిన వెంటనే ఎల్‌ఆర్‌ ఇవ్వాలన్నారు. ప్రతి మండలంలో ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భూము లు ఎక్కడెక్కడ ఉన్నాయి? రికార్డు ప్రకారం ఎంత? వంటి వివరాలను ప్రతి తహసీల్దార్‌ సేకరించాలన్నారు. జిల్లాలో దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్టుల కాలువల భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, ఏడీ సర్వేలను సుదర్శన్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ భవ్య, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement