ఐకమత్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

ఐకమత్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యం

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

మిరుదొడ్డి(దుబ్బాక): ఐకమత్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని సమాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని ధర్మారంలో గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన మట్లాడుతూ విదేశీ పాలకుల స్వార్థం కోసం విభజించు పాలించు విధానాల వల్ల సమాజంలో అంతరాలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల మధ్య భేద భావాలను తొలగించి సమానత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల నరేష్‌ బాబు, సర్పంచ్‌ చెప్యాల శ్రీనివాస్‌, ఉప సర్సంచ్‌ బాలరాజు, సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌, మెదక్‌ విభాగ్‌ కో కన్వీనర్‌ మాలె రమేష్‌, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement