దుబ్బాక: పీఆర్టీయూ రాష్ట్ర కమిటీలో దుబ్బాక మండలానికి పెద్ద పీటవేశారు. నల్గొండలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా మద్దుల లక్ష్మారెడ్డి, సింగీతం నర్సింహారావు, రాష్ట్ర సెక్రటరీగా లచ్చపేట మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సామిలేటి బుచ్చిబాబులను ఎన్నుకున్నారు. మండలంనుంచి ముగ్గురు ఎన్నిక కావడంపై దుబ్బాక పట్టణ శాఖ అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్‌గౌడ్, రాంచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
మండలం నుంచి ముగ్గురికి చోటు


