న్యూస్‌రీల్
2010కి ముందు నియమితులైన వారికి తప్పని టెట్ మొదటి విడతలో 2,557 మందికి 1,711 మంది ఉత్తీర్ణత ఉమ్మడి జిల్లాలో 846 మంది ఉపాధ్యాయులు ఫెయిల్ నవంబర్‌లో రెండో విడత
బుధవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
చదువు చెప్పాలా? చదువుకోవాలా?
చేతిలో చాక్.. ముందున్నది బ్లాక్‌బోర్డు.. ఏళ్ల అనుభవం.. అయినా ఇప్పుడు ఆ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. 2010కి ముందు డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు సైతం టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత సాధించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం విదితమే. ఆగస్టు 31, 2028 వరకు టెట్ ఉత్తీర్ణత సాధించాలి. టీజీటెట్ ఇన్‌సర్వీస్ టీచర్స్–2026 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2,777 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. ఇందులో 2,557 మంది పరీక్ష రాయగా 1,711 మంది ఉత్తీర్ణులయ్యారు. 846 మంది ఫెయిల్ అయ్యారు.
– సాక్షి, సిద్దిపేట


