జిల్లా స్థాయి గట్కా పోటీలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయి గట్కా పోటీలు

Sep 30 2026 7:42 AM | Updated on Sep 30 2026 7:42 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా స్థాయి గట్కా పోటీలు, జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్‌లో మంగళవారం కొనసాగాయి. అండర్‌–14, 17 విభాగాల్లో 29 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్‌ –14 విభాగంలో 8 మంది, అండర్‌–17 విభాగంలో 8 మంది క్రీడాకారులును ఉమ్మడి మెదక్‌ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు గట్కా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మోతుకు నరే ష్‌కుమార్‌ తెలిపారు. ఈ పోటీల నిర్వహణలో పీఈటీలు నవీన్‌, ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించండి

భవన నిర్మాణ కార్మిక సంఘం

రాష్ట్ర అధ్యక్షుడు చంద్రం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర లేబర్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందించిన్నట్లు రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లో అంజయ్య కార్మిక భవన్‌లో లేబర్‌ కమిషనర్‌ రంగనాథ్‌ను కలిసి వినతి పత్రం అందించామన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అమలులోకి వచ్చిన కార్మిక చట్టాలు, సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరామన్నారు. 1996లో అమలులోకి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ద్వారా కార్మికులకు సంక్షేమ ప్రయోజనాలు అందించే అవకాశం ఏర్పడిందని, అయితే రాష్ట్రంలో అర్హులైన కార్మికులందరికీ పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు.

పన్ను వసూలుకు

జప్తు నోటీసులు

సిద్దిపేటఅర్బన్‌: ఆస్తి పన్ను చెల్లించకుండా తాత్సారం చేస్తున్న పలు వాణిజ్య సంస్థలకు, వాణిజ్య బిల్డింగ్‌ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల్లోగా ఆస్తి పన్నును చెల్లించాల్సి ఉంటుంది. కానీ మరో మూడు నెలలు గడిచినా చెల్లించలేదు. దీంతో మొదటగా డిమాండ్‌ నోటీసులు రెండు సార్లు ఇచ్చినప్పటికి టాక్స్‌ చెల్లించకపోవడంతో పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం జప్తు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీవో జోగం రాజు తెలిపారు. మండలంలోని మిటపల్లి పరిధిలో సురభి మెడికల్‌ కళాశాలకు సంబంధించిన రూ. 49 లక్షలు, ఆర్చ్‌ ఫార్మా ల్యాబ్స్‌కు సంబంధించి రూ. 16 లక్షలు, మిట్టపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌బీఐ భవనానికి సంబంధించిన రూ. లక్ష పన్ను బకాయి ఉన్నట్లు తెలిపారు. వీరికి మూడు రోజుల గడువుతో జప్తు నోటీసులు జారీ చేశామన ఎంపీఓ తెలిపారు.

నేడు జూడో, యోగా

క్రీడాకారుల ఎంపికలు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని టీటీఆర్‌సీ భవనంలో బుధవారం ఉమ్మడి మెదక్‌ జిల్లా జూడో, యోగా క్రీడాకారులు ఎంపికలు జరుగనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌ మంగళవారం తెలిపారు. అండర్‌–14, 17 విభాగంలో జూడో, యోగా క్రీడా పోటీలు నిర్వహించి, ఇందులో ఉమ్మడి మెదక్‌ జిల్లా జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9గంటల లోపు హాజరుకావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement