జాషువా రచనలతో సామాజిక చైతన్యం | - | Sakshi
Sakshi News home page

జాషువా రచనలతో సామాజిక చైతన్యం

Sep 30 2026 7:42 AM | Updated on Sep 30 2026 7:42 AM

రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

కొండి మల్లారెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): అణగారినవర్గాల గొంతు కగా నిలిచిన జాషువా రచనలు సామాజిక చైతన్యానికి ఎంతగానో తోడ్పడ్డాయని రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి అన్నారు. వెన్నెలసాహితీ సంగమం ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన జాషువా జయంతి, కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడు తూ జాషువా, తెలుగు సాహిత్య చరిత్రలో సాహిత్య చైతన్యానికి, మానవతావాదానికి ప్రతీకగా నిలిచారన్నారు. ఆయన రచనలు సామాజిక మార్పునకు ఎంతగానో దోహదంచేశాయన్నారు. జాషువా చిరస్మరణీయులని, తనరచనలు భావితరాలకు, దిక్సూచిలా దారి చూపుతాయన్నారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఆశోకరాజు, స్రవంతి, దారం మల్లారెడ్డి, మహమూద్‌ పాషా, గాలిరెడ్డి, సర్దార్‌ హుస్సేన్‌, మధుసూదన్‌ రెడ్డి, ప్రవీణ్‌, మహేంద్రం, ఉమారాణి, సుధాకర్‌, లక్ష్మణ్‌ రావు, పర్శరాములు, రవిందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, జగదీశ్‌, రమేశ్‌లాల్‌, దామోదర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement