ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రాధాన్యం

Sep 30 2026 7:42 AM | Updated on Sep 30 2026 7:42 AM

● రాష్ట్ర కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య ● కలెక్టరేట్‌లో ల్యాండ్‌, అట్రాసిటీస్‌ రోస్టర్‌పై సమీక్ష

● రాష్ట్ర కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య ● కలెక్టరేట్‌లో ల్యాండ్‌, అట్రాసిటీస్‌ రోస్టర్‌పై సమీక్ష

సిద్దిపేటరూరల్‌: ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం కోసం కమిషన్‌ కృషి చేస్తోందని రాష్ట్ర కమిషన్‌ చైర్మన్‌ బక్కివెంకటయ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో ల్యాండ్‌, అట్రాసిటీస్‌, రోస్టర్‌పాయింట్‌ అమలు బ్యాక్‌లాగ్‌ ఖాళీలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌కు చేరుకున్న బక్కి వెంకటయ్యకు కలెక్టర్‌ మొక్కను అందించి స్వాగతించారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించి, సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అట్రాసిటీ కేసుల వివరాలు, బాధితులకు రావాల్సిన పరిహారం డబ్బులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దళిత సంఘాల సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట అర్బన్‌ మండలం ఇమాంబాద్‌లో అన్నదానం విషయంలో ఇటీవల జరిగిన వివక్షతపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలన్నారు. పలు రకాల సమస్యలను కమిషన్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. భూపంల్లి పీహెచ్‌సీలో ఓ దళిత బిడ్డకు గడువుదాటిన ఇంజక్షన్‌ వేయడంతో ఇబ్బంది తలెత్తిందని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారన్నారు. పీహెచ్‌సీఓలో సిబ్బంది సైతం సరిగ్గా పనిచేయడం లేదన్నారు. సిద్దిపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి ఎస్సీ, ఎస్టీ సిబ్బందిని చిన్నచూపు చూస్తోందని, తక్కువ చేసి మాట్లాడుతున్నారనే ఫిర్యాదు వచ్చిందన్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ ఆమెను కలెక్టరేట్‌ పిలిపించి మందలించారు. ప్రతీ నెలా గ్రామాల్లోని ప్రధాన చౌరస్తా, కూడలి వద్ద పౌరహక్కుల దినం నిర్వహించాలని, దీనికి తహసీల్దార్‌, ఎస్‌ఐ వివిధ శాఖల అధికారులు హాజరు కావాలన్నారు. ఆర్‌అండ్‌బి శాఖకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేసిందని, వాటిని అవసరమైన ప్రాంతాల్లో నిర్మించేందుకు ప్రణాళిక సిద్దం చేసిందన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు, పోలిస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

త్వరలోనే పరిహారం..

అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పెండింగ్‌ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ విడుదల కాగానే బాధితులకు నష్టపరిహారం అందజేస్తామన్నారు. అనంతరం పోలీస్‌ పోలీస్‌ కమిషనర్‌ సాధనరష్మి పెరుమాళ్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సీరియస్‌గా తీసుకుని 60 రోజుల్లో దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తున్నామన్నారు. ఆక్టోబర్‌ 4న కమిషన్‌ చైర్మన్‌ పదవీకాలం పూర్తవుతున్నందున కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజాగంగారాం, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ విజయ్‌ భార్గవ్‌, విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, ఆర్డీఓలు, ఏసీపీలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement