ఓపెన్‌ ప్లాట్లు.. ఆరోగ్యానికి తూట్లు | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ ప్లాట్లు.. ఆరోగ్యానికి తూట్లు

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

● విజృంభిస్తున్న దోమలు, ఈగలు ● భయాందోళనలో ప్రజలు ● నిధులు వెచ్చించినా కానరాని ఫలితం

● విజృంభిస్తున్న దోమలు, ఈగలు ● భయాందోళనలో ప్రజలు ● నిధులు వెచ్చించినా కానరాని ఫలితం

దుబ్బాకటౌన్‌: అసలే వర్షాకాలం.. ఆపై నివాస ప్రాంతాల్లో అపరిశుభ్రత. దీంతో ఈగలు వృద్ధి చెంది జ్వరాలు, డయేరియా, మలేరియా, డెంగీ ప్రబలుతున్నాయి. పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో పొదలు, గడ్డి, వర్షపు నీరు నిల్వలేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దుబ్బాక మున్సిపల్‌ 20 వార్డుల్లో పలుచోట్ల ఖాళీ స్థలాలు, గడ్డి పొదల్లో మురుగు నీరు నిలిచి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. పలు కాలనీల్లో శుభ్రత లేక, ఫాగింగ్‌ చేపట్టక, దోమలు, ఈగలు విజృంభిస్తుండటంతోపాటు దుర్గంధం వ్యాపిస్తోంది. ఇళ్ల స్థలాల యజమానులు కనీస చర్యలు చేపట్టకుండా, ఖాళీ ప్లాట్లను నిర్లక్ష్యంగా వదిలేయడంతో కురుస్తున్న వర్షాలతో అంటువ్యాధులకు నిలయాలుగా మారుతున్నాయి.

జంతువులకు ఆవాసాలుగా

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో వేల సంఖ్యలో ఖాళీ స్థలాలు, ప్లాట్లు ఉన్నాయి. దుబ్బాకలో దాదాపు 400, చేర్యాలలో 350, హుస్నాబాద్లో 400, సిద్దిపేటలో 2,000, గజ్వేల్లో 1,000 వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు. మున్సిపాలిటీలో పలు వార్డుల్లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో, పట్టణ శివారుల్లో ఉన్న ప్లాట్ల వెంచర్లలో ఏపుగా పెరిగిన గడ్డి, పొదల్లో నిలిచిన నీరు దోమలు, కుక్కలు, పందులకు ఆవాసాలుగా మారుతున్నాయి. దీంతో దోమలు విజృంభించి, జ్వరాలు, ఇతర అంటువ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో దోమలమందు పిచికారీ, ఆయిల్‌ బాల్స్‌ పంపిణీకి నెలకు వేలాది రూపాయలు ఖర్చవుతున్నా ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదనే విమర్శలున్నాయి.

అవగాహన కల్పిస్తున్నాం

డెంగీ, అంటు వాధ్యులు, సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మున్సిపాలిటీలో పిచ్చి మొక్కలు, గడ్డితో నిండిన ఖాళీ ప్లాట్లను గుర్తించి యజమానులకు నోటీసులిస్తున్నాం. ఖాళీ స్థలాలను శుభ్రపరిచేలా చర్యలు తీసుకుంటాం. ప్రతీ వార్డులో దోమల నివారణకు ఫాగింగ్‌ చేపడతాం. – మహేశ్‌ కుమార్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, దుబ్బాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement